Kavitha : ఇప్పటికైనా నిజం చెప్పాలి.. శిక్ష తప్పదు: కవిత అరెస్టుపై లక్ష్మణ్! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం ఉందో లేదో ఇప్పటికైన బయటపెట్టాలన్నారు. నేరం చేయకపోతే ఆమెకు భయమేందుకని, తప్పు చేస్తే శిక్ష తప్పదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 16 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ(BJP) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. గత ఏడాది కాలంగా ఈడీ(ED) ఈ కేసులో దర్యాప్తు చేస్తోందని, ఢిల్లీ(Delhi) ప్రభుత్వంలోని పెద్దలపై ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయని ఆ రాష్ట్ర మంత్రి కూడా జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. సంబంధం ఉందో లేదో చెప్పాలి.. ఈ మేరకు లిక్కర్ కేసు(Liquor Case) లో కవితకు సంబంధం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కోర్టులో కవిత తన వాదన చేప్పుకోవచ్చని, నేరం చేయకుంటే శిక్ష పడదని చెప్పారు. ఒకవేళ ఆమె నేరం చేస్తే శిక్ష పడుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నేరం చేయకపోతే ఆమెకు భయమేందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తెలంగాణను లూటీ చేసిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరుగుతోందని, అవినితీపరులపై చర్చలు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: Maoist : 30 ఏళ్ల అజ్ఞాతవాసం.. లొంగుబాటలో మావోయిస్టు జ్యోతక్క? మోడీని ఎవరూ ఆపలేరు.. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఓబీసీలను విస్మరించిందని మండిపడ్డారు. కేంద్రంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఎందుకు ఇవ్వలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మీహయాంలో కుల గణన ఎందుకు చేపట్టలేదని, మోడీ(PM Modi) మళ్లీ ప్రధాని అవుతాడని, దానిని ఎవరూ ఆపలేరన్నారు. మరోసారి మోడీ ప్రభుత్వం రావడం కాంగ్రెస్ కు ఇష్టంలేదని, ఆయన విజయాన్ని సహించలేకపోతున్నారంటూ పలు ఆరోపణలు చేశారు. #brs #bjp #mlc-kavitha #laxman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి