Chandrababu : మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం!

ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ ప్రజలకు సేవకులగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

New Update
NTR Bharosa : ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పండుగ..పెనుమాకలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్!

AP CM Chandrababu : ఏపీ (Andhra Pradesh) లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగలా మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబే స్వయంగా పింఛన్లను అందించేందుకు రంగంలోకి దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన పెన్షన్‌ (Pension) పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సోమవారం ( జులై 1) ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించారు.

అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి కార్యక్రమం ఇదే కావడంతో ఏపీలో ఈ కార్యక్రమానికి విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ నగదు మొత్తాన్నిఅందజేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.

పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి సభను తెలుగుదేశం పార్టీ (TDP) కి గట్టి పట్టు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని వివరించారు. ఎప్పుడూ ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిందని, మిత్రపక్షాలను పోటీలో నిలబెట్టినా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని సాధించిన స్థానాల్లో ఇదీ ఒకటి అంటూ చెప్పారు.

గాజువాకలో 95 వేలు, భీమిలీలో 94 వేలు, మంగళగిరిలో 91 వేల మెజారిటీని సాధించామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా, గెలవాలనే తపనతో మంగళగిరి నుంచే నారా లోకేష్ పోటీ చేశారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రం మీద విచ్చలవిడిగా అప్పులు చేసి, ఉన్న ఖాజానాను ఖాళీ చేసిందని చంద్రబాబు విమర్శించారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఇంకా తనకే తెలియదని వ్యాఖ్యానించారు. దొరికిన అన్ని చోట్లా అప్పులు చేశారని ఆరోపించారు.

గత అయిదు సంవత్సరాల్లో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిన్నదని, దాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను పనికి రాను అని ఒక వ్యక్తి గత ఐదేళ్లలో నిరూపించుకున్నాడని, ఆ వ్యక్తి పేరు పలకడానికి కూడా తాను ఇష్టపడట్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ ప్రజలకు సేవకులగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని అన్నారు. ఎలాంటి ఆడంబరాల జోలికి వెళ్లకుండా సింపుల్‌గా ఉంటామని తెలిపారు. పరిపాలన అనేది ప్రజలకు సేవ చేయడానికే తప్ప వారిపై ఆధిపత్యం, పెత్తనం చలాయించడానికి కాదని అన్నారు.

Also read: ఎస్సై ఆత్మహత్యాయత్నం!

Advertisment
Advertisment
తాజా కథనాలు