Waynad : 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. మట్టిదిబ్బల కింద ఇంకెందరో..!

కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300 కు చేరింది. మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు.

New Update
Wayanad : వయనాడ్‌ ఇన్సిడెంట్‌ తరువాత కేంద్రం అలర్ట్..ఆ 6 రాష్ట్రాలకు...!

Wayanad Landslides : కేరళ (Kerala) లో భారీ వర్షాలకు (Heavy Rains) కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300 కు చేరింది. మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు.

తీవ్రంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ అధికారులు జాగిలాలతో అన్వేషిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా మృతిచెందారని NDRF డీఐజీ మొహసేన్ షాహిదీ ప్రకటించారు.

234 మంది గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇంకా సుమారు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బయటపడిన కొందరు ప్రజలు సోమవారం అర్ధరాత్రి జరిగిన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని బాధితులు తెలిపారు. కిటికీలోంచి చూడగా పెద్ద ఎత్తున నీరు తమ ఇళ్ల వైపు రావడం కనిపించిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైకి వెళ్లామనీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు గానీ మరొకరిని కాపాడేందుకు గానీ వీలు లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. సెల్‌ఫోన్లను వదిలి ఇళ్లపై కప్పుల పైకి వెళ్లడం వల్ల ఎవరికీ సమాచారం అందించలేకపోయినట్లు తెలిపారు.

Aslo read: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వానలే..వానలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment