Waynad Landslides : వయనాడ్‌ బీభత్సం.. ప్రకృతి కోపమా...? మన పాపమా..?

కేరళలో మంగళవారం తెల్లవారు జామున వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన దారుణ ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 287చేరింది. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

New Update
Waynad Landslides : వయనాడ్‌ బీభత్సం.. ప్రకృతి కోపమా...? మన పాపమా..?

Kerala : కేరళలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మంగళవారం తెల్లవారు జామున వయనాడ్‌ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిపడిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్‌ నామారూపాలు లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ప్రజలు నివసించే వారు అనే చెప్పుకొనే పరిస్థితులు వయనాడ్‌ లో కనిపిస్తున్నాయి.

ఈ దారుణ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 287చేరింది. ఇంకా 240 మంది ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నుంచి అధికారులు, సహాయక బృందాల వారు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు మొదలు పెట్టారు.

వయనాడ్‌లోని కొండ ప్రాంతాల్లో టీఎస్టేట్‌లు ఎక్కువగా ఉండటంతో అక్కడ పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఇక్కడకి కుటుంబాలతో సహా ఇక్కడ కాపురాలు ఉంటారు. అలా వలస వచ్చిన వారిలో 600  కార్మిక కుటుంబాలు అసలు ఏమైయ్యారో అనే విషయం ఇప్పటికీ తెలియలేదు.

సహాయక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. ఇక ఎగువ నుంచి కొండచరియలు, బురద విపరీతంగా పేరుకుపోవడంతో అక్కడి పరిస్థితులు భయానకంగా తయారు అయ్యాయి. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వయనాడ్​లో కొండచరియలు విరిగిపడటానికి అధిక మైనింగ్, ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం, వాతావరణ మార్పుల ప్రభావం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023 లో విడుదల చేసిన ల్యాండ్​స్లైడ్​ అట్లాస్ వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడే 30 జిల్లాల్లో 10 జిల్లాలు ఒక్క కేరళలోనే ఉన్నాయి.

అరేబియా సముద్రం వేడెక్కడం రాష్ట్రంలో అత్యంత భారీ, అనూహ్య వర్షపాతానికి కూడా ఒక కారణమని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్​డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ వివరించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం వెచ్చగా మారుతోందని, దీనివల్ల కేరళ సహా ఈ ప్రాంతంపై వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎస్.అభిలాష్ వివరించారు.

అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేఘ వ్యవస్థలు తక్కువ సమయంలో అతి భారీ వర్షాలకు (Heavy Rains) కారణమవుతాయని, ఇది కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

వయనాడ్ పర్వత శ్రేణులను పర్యావరణపరంగా సున్నితమైనవిగా ప్రకటించాలని ‘పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ’ పేర్కొంది. అత్యంత సున్నితమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, విచ్చలవిడిగా జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని ఈ ప్యానెల్‌ వివరించింది.

ఘటనాస్థలి నుంచి ప్రజలను రక్షించేందకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలు నిర్మించాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ గురువారం పర్యటించబోతున్నారు.

ఇదిలా ఉండగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు బెయిలీ అనే తాత్కాలిక వంతెనలను నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాలలో ఈ వంతెనలను సహాయక బృందాలు నిర్మించాయి. వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్‌ వంతెన నిర్మాణానికి కావాల్సిన పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తీసుకుని వచ్చారు. వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తీసుకుని వెళ్లవచ్చు.

తమ రాష్ట్రంలో ఇటువంటి విషాదాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియాతో ప్రస్తావించారు. 'మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. రెండు రోజుల సహాయక చర్యల్లో 1,592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 219 మందిని ఆసుపత్రుల్లో చేర్చాం. వారిలో 78 మంది తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించాం". అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గురువారం వయనాడ్​లో సీఎం అధ్యక్షతన అఖిల సమావేశం జరగనుందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. సహాయక శిబిరాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పర్యటించనున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు కేరళలోని ఐదు జిల్లాలకు రెడ్​ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో 10 జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

Also read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ అత్యాచారం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment