Vijayawada : విజయవాడలో పెట్రోల్‌ కు బదులు నీళ్లు!

విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్‌ లో పెట్రోల్‌ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అజిత్‌ సింగ్‌ నగర్ లో ఉన్న బంకులో పెట్రోల్‌ కోసం వచ్చిన వాహనదారులకు ఈ చిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్‌ ట్యాంక్‌ లో వాన నీరు కలవడం వల్ల ఇలా జరిగిందని బంకు యాజమాన్యం తెలిపింది.

New Update
Vijayawada : విజయవాడలో పెట్రోల్‌ కు బదులు నీళ్లు!

Petrol : విజయవాడ (Vijayawada) లోని ఓ పెట్రోల్ బంక్‌ (Petrol Pump) లో పెట్రోల్‌ కు బదులు నీళ్లు (Water) కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరలోని అజిత్‌ సింగ్‌ నగర్ లో ఉన్న పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ కొట్టించుకుందామని వచ్చిన వాహనదారులకు ఈ విచిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ కొట్టించుకుని కొంచెం దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతున్నాయి.

దీంతో వాహనదారులు మెకానిక్‌ ల దగ్గరకు వెళ్లగా..వారు పెట్రోల్‌ లో నీరు కలిసిన విషయాన్ని గుర్తించి చెప్పారు. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ నగర్ లోని పెట్రోల్ బంక్ ఎదుట నిరసన చేపట్టారు.

దీంతో, బంకు యాజమాన్యం స్పందించింది. వాననీరు భూగర్భంలోని పెట్రోల్ ట్యాంకులో కలవడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు మళ్లీ పెట్రోల్ కొట్టిస్తామని, నీళ్లు కలవడం వల్ల పాడైన వాహనాలకు రిపేర్లు కూడా చేయిస్తామని ఆ పెట్రోల్ బంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. దాంతో, వాహనదారులు శాంతపడ్డారు.

Also read: ఘోర ప్రమాదం..లోయలో పడిన బస్సు..70 మంది ప్రయాణికులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు