STUDENT LIFE: ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగే కాలేజ్ స్టూడెంట్స్ కు హెచ్చరిక! కాలేజ్ లైఫ్ లేట్ నైట్ స్టడీస్ ,అసైన్‌మెంట్‌లు పూర్తి చేయడం, రాత్రి వేళల్లో లేట్ గా నిద్రపోతూ ఉంటారు ఈ మధ్యలో ఎనర్జీ డ్రింక్స్ లెక్కలేనన్ని తాగుతూ ఉంటారు.ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ మరియు ఇతర ఉత్ప్రేరకాలు నిద్ర పోయేటప్పుడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. By Nedunuri Srinivas 25 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ENERGY DRINKS : స్టూడెంట్ లైఫ్ ఆ జోషే వేరు.ముఖ్యంగా ఇప్పుడున్న కాంపిటీషన్లో చదవటం అనేది పెద్ద ఛాలెంజ్. మిడ్ నైట్ దాటేవరకు స్టడీస్,వీకెండ్స్ లో లాంగ్ డ్రైవ్స్ ఇలా ..365 రోజులు పగటితో పాటు రాత్రులు కూడా బిజీగా గడుపుతూ ఉంటారు. అలాగని సరయిన ఆహారానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు.ఆకలి టైమ్ కు ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. అప్పుడే వస్తాయి అసలు చిక్కులు. ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల చాలా ప్రమాదం పొంచీ ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇలా .ఈ ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల పడుకునే ఆ కొద్ది టైమ్ లో కూడా మీ రాత్రి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు చుట్టుముడతాయి. పరిశోధనలో షాకింగ్ విషయం మీరు ఎంచుకున్న ఎనర్జీ డ్రింక్స్ మీకు అలసట నుండి ఉపశమనం కలిగించే బదులు అనారోగ్యకరమైన నిద్ర మరియు నిద్రలేమికి దారితీస్తాయని చాలా మందికి తెలియదు.తాజాగా నార్వేజియన్‌లోని ఓ ప్రధాన పరిశోధనలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓపెన్-యాక్సెస్ జర్నల్ BMJ ఓపెన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఎనర్జీ డ్రింక్ వినియోగం వల్ల నాణ్యమైన నిద్రకు దూరం అవుతారని తేలింది.చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఈ నిద్ర లేమితో బాధపడుతున్నట్లు సర్వే లో తేలింది. పరిశోధన ఫలితాలు ఆశ్చర్యపరిచాయి 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల 53,266 మంది విద్యార్థుల డేటాను సేకరిస్తే .. వారు తీసుకునే ఎనర్జీ డ్రింక్స్ పానీయాల క్వాంటిటీని, వారు నిద్ర పోతున్న సమయాన్ని ,వారి నాణ్యమైన నిద్ర మధ్య సంబంధాన్ని కంపేర్ చేస్తూ అధ్యయనం చేశారు. పరిశోధన ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. ఎనర్జీ డ్రింక్స్‌ను క్రమం తప్పకుండా తీసుకునే విద్యార్థులు సక్రమంగా నిద్రపోవడం, చాలా తక్కువ నిద్ర పోవడం,నిద్రకు ఇబ్బంది కలిగించే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు కనుగొన్నారు. ఎనర్జీ డ్రింక్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే నిద్ర సమస్యలు అంత తీవ్రంగా ఉంటాయి. స్లీప్ సైకిల్ డిస్ట్రబ్ ముఖ్యంగా మనుషులలో ఉండే స్లీప్ సైకిల్ డిస్ట్రబ్ అవుతుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ మరియు ఇతర ఉత్ప్రేరకాలు నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పదార్థాలు మెదడులోని అడెనోసిన్ అనే నిద్రను ప్రేరేపించే రసాయనంను నిరోధించాయి. దీని ఫలితంగా, ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే వ్యక్తులు నిద్రపోవడం కష్టం. విద్యార్థులకు ఒక హెచ్చరిక ఎనర్జీ డ్రింక్స్ తాగే విద్యార్థులు తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. నిద్రలేమి అనేది తీవ్రమైన నిద్ర రుగ్మత, ఇది శ్రద్ధ, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అధ్యయనం యొక్క ఫలితాలు కళాశాల విద్యార్థులకు ఒక హెచ్చరికగా ఉపయోగపడతాయి. ఎనర్జీ డ్రింక్స్ తాత్కాలిక శక్తిని పెంచుతాయి, కానీ అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ నిద్ర నాణ్యతకు హాని కలిగిస్తాయి. సో...కాలేజ్ స్టూడెంట్స్ ఎనర్జీ డ్రింక్స్ కు దూరం గా ఉండండి. ALSO READ:ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!! - #health-care #brain-memory #student-life #college-students #norwegian మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి