Free Sand: ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో దుమారం.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం!

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఉచిత ఇసుక అంటూ ధరలను వసూలు చేస్తున్నారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తుంటే.. వైసీపీ హయాంలో కంటే తక్కువేగా అంటూ టీడీపీ క్యాడర్ కౌంటర్ ఇస్తోంది.

New Update
Free Sand: ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో దుమారం.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం!

Free Sand: ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువస్తూ జీవో విడుదల చేశారు. ఇసుక విధానంలో వైసీపీ గతంలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఆరోపించింది. అందుకే తాము అధికారంలోకి వస్తే కనుక ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఉచిత ఇసుకను ఇస్తున్నట్టు ఇప్పుడు జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ.. ఇసుక ఉచితం అంటూనే.. ఇసుక ధర టన్నుకు ఇంత అంటూ ధరను నిర్ణయిస్తూ బ్యానర్లు కట్టడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇసుక ఉచితం అంటూ.. మళ్ళీ ఈ ధర ఏమిటి అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

Free Sand: ఇసుక ధరల విషయంపై సోషల్ మీడియాలో వైసీపీ-టీడీపీ మధ్య పెద్ద వార్ నడుస్తోంది.  ఉచితం అంటూనే ధరలు నిర్ణయించారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా.. అవి ఇసుక లోడింగ్.. రీచ్ నుంచి రోడ్డుకు చేర్చే చార్జీలు అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నపుడు వసూలు చేసిన ధరలను.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ధరలను పోల్చి చూపిస్తూ కొందరు X వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.

Free Sand: ఇటు వైసీపీ.. అటు టీడీపీ పోటాపోటీగా X వేదికగా ట్వీట్లను రువ్వుకుంటున్నారు. ఆ ట్వీట్స్ కు రిప్లైలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక ఉచిత విధానంపై ఇప్పుడు సోషల్ మీడియా రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. రాజకీయాలపై చర్చ సోషల్ మీడియాలో ఈ స్థాయిలో జరగడం.. అసలు ఇసుక విధానంలో ప్రభుత్వం ఏమి చేసింది అనే విషయం సామాన్య ప్రజానీకానికి అర్ధంకాని పజిల్ లా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో స్పష్టత వస్తేనే కానీ ఈ సోషల్ మీడియా యుద్ధం ఆగేలా లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 


Advertisment
Advertisment
తాజా కథనాలు