Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. సొంతూళ్లకు పయనం రేపు ఎన్నికలు జరగనున్న వేళ.. ఓటు వేసేందుకు నగరవాసులు తమ స్వస్థలాలకు క్యూ కట్టారు. నిన్నటి నుంచి హైవేలపై భారీగా ట్రాఫిక్ నెలకొంది. సాధారణ రోజుతో పోల్చితే అదనంగా 10 వేల వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. By B Aravind 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Voters Reaching Their Home Town : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు ఎన్నికలు(Elections) జరగనున్న వేళ.. ఓటు వేసేందుకు నగరవాసులు తమ స్వస్థలాలకు క్యూ కట్టారు. మూడు రోజులుగా వరుస సెలవులు రావడంతో పెద్ద ఎత్తున జనాలు పల్లె బాట పట్టారు. దీంతో బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వారం రోజుల పాటు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. దీంతో పలువురు సొంత వాహనాల్లోనే వెళ్తున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. Also Read: దేశంలోనే ఖరీదైన ఎన్నిక ఎక్కడంటే.. నిన్నటి నుంచి హైవేలపై భారీగా ట్రాఫిక్ నెలకొంది. సాధారణ రోజుతో పోల్చితే అదనంగా 10 వేల వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad) నుంచి ఏపీకి 500 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. బెంగళూరు, చెన్నై నుంచి ఏపీ(Andhra Pradesh)కి స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు. అలాగే పలు రైళ్లకు కూడా అదనపు బోగీలు ఏర్పాటుచేసింది రైల్వేశాఖ. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనుండటంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు తెలంగాణ(Telangana) లో కూడా పలు జిల్లాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందిస్తున్నారు. Also Read: ఓటు వేయడంలో ఎనీ డౌట్.. అన్నిటికీ సమాధానం ఇక్కడ ఉంది! #telugu-news #2024-lok-sabha-elections #ap-voters #home-town మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి