Yashasvi Jaiswal: 16ఏళ్ల నిరీక్షణకు తెర.. యశస్వీ డబుల్‌ సెంచరీతో బద్దలైన ఏళ్లనాటి రికార్డులు!

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. 16ఏళ్ల తర్వాత భారత్ తరుఫున డబుల్ సెంచరీ చేసిన లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

New Update
Yashasvi Jaiswal: 16ఏళ్ల నిరీక్షణకు తెర.. యశస్వీ డబుల్‌ సెంచరీతో బద్దలైన ఏళ్లనాటి రికార్డులు!

Yashasvi Jaiswal Records: ఎవరూ సెంచరీ కొట్టలేదు.. కనీసం హాఫ్‌ సెంచరీ కూడా కొట్టలేదు.. కాసేపు నిలబడినా భారీగా పరుగులు మాత్రం సాధించలేకపోయారు. కానీ ఒకడు మాత్రం 50 కాదు.. 100 కాదు.. ఏకంగా 200 పరుగులు సాధించాడు.. అందరూ ఔట్ అవుతున్నా ఒక్కడే అలా నిలబడి ఇంగ్లండ్‌ బౌలర్లను బాదిపడేశాడు. మంచి స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత్ యువ కేరటం యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal) గురించే ప్రధాన చర్చ. విశాఖ వేదికగా ఇంగ్లండ్‌పై జరుగుతున్న రెండో టెస్టులో (India Vs England) యశస్వీ జైస్వాల్‌ డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో అతని ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి.


ఎన్నో రికార్డులు:
యశస్వీ అద్భుత ప్రదర్శనతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 290 బంతుల్లో 209 రన్స్ చేసిన యశస్వీ ఖాతాలో 19 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అవతలి ఎండ్‌లో బ్యాటర్లు అవుట్ అవుతున్నా యశస్వీ మాత్రం అలా నిలపడిపోయాడు. టెస్టుల్లో భారత్ తరుఫున డబుల్ సెంచరీ (Double Century) చేసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో చేరిపోయాడు యశస్వీ. గతంలో వినోద్‌ కాంబ్లీ, సునీల్‌ గవాస్కర్‌ తక్కువ వయసులోనే డబుల్ సెంచరీ చేశారు. అగ్రస్థానంలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 35 రోజులు) ఉన్నాడు. 1993లో ఇంగ్లండ్‌పై 224 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 1993లోనే జింబాబ్వేపై 227 పరుగులు చేశాడు. అప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాల 55 రోజులు. 1971లో వెస్టిండీస్‌పై 220 పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) కాంబ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

గంభీర్‌ తర్వాత:
అంతేకాదు మయాంక్ అగర్వాల్ (నవంబర్ 2019) తర్వాత టెస్టు ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ మార్కును అధిగమించిన మొదటి భారతీయుడుగా నిలిచాడు యశస్వీ. గౌతమ్ గంభీర్ తర్వాత టెస్ట్‌లలో డబుల్ చేసిన మొదటి ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా యశస్వీనే. గంభీర్‌ 2008లో ఆస్ట్రేలియాపై 206 పరుగులు చేశాడు. అప్పటినుంచి మరో లెఫ్ట్ టీమిండియా హ్యాండర్‌ డబుల్‌ సెంచరీ సాధించలేకపోయారు.

Also Read: లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shardul Thakur: అలా ఎలా వేశావ్ బ్రో.. ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్.. చెత్త రికార్డ్ ఇదే!

ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రీసెంట్‌గా కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లోనే 11బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

New Update
Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR

Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR

ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు మించి రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం పలు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో టైటిల్ కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్లు వరుస ఓటములను ఎదుర్కొంటున్నాయి. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

కానీ ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన జట్లు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రం అందరి అంచనాలకు మించి అద్భుతాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఎవరి ఊహలకు అందని చెత్త రికార్డులతో వార్తల్లో నిలుస్తున్నారు.  

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

చెత్త రికార్డు

ఈ 2025 సీజన్‌లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రీసెంట్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్  VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించినా.. శార్ధూల్ ఠాకూర్ మాత్రం ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. కేవలం ఒక్క ఓవర్‌లోనే 11 బాల్స్ వేశాడు. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

అది మాత్రమే కాకుండా వరుసగా 5 వైడ్లు వేశాడు. ఇది కూడా 2025 సీజన్‌లో ఒక చెత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇలా ఐపీఎల్ చరిత్రలోనే లాంగెస్ట్ ఓవర్‌ వేసిన బౌలర్ గా శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన శార్ధూల్ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

(shardul-thakur | IPL 2025 | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు