YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో సంచలన మలుపు.. సునీతతో పాటు వారిపై పులివెందులలో కేసు

పులివెందుల పోలీస్ స్టేషన్లో వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసు విషయంలో కొందరి పేర్లు చెప్పాలని వీరు బెదిరించారని వివేకా పీఏ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిపై కేసు నమోదైంది.

New Update
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో సంచలన మలుపు.. సునీతతో పాటు వారిపై పులివెందులలో కేసు

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ (YS Jagan) చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో తనను బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: AP Elections 2024: మంగళగిరికి మెగా బ్రదర్స్ మకాం.. పవన్, నాగబాబు కొత్త స్కెచ్ ఇదేనా?

నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు కృష్ణారెడ్డి రెడ్డి. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి తెచ్చారని పిటీషన్ లో వివరించారు. ఈ మేరకు గత ఎస్పీ అన్బురాజన్ ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.
publive-image

తనకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ప్రయోజనం లేకపోవడంతో కోర్టు ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు చేసింది. దీంతో పులివెందుల పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు