Viveka Case: వివేకా హత్యకేసులో దస్తగిరికి బిగ్ రిలీఫ్! వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి న్యాయస్థానం ఊరట కల్పించింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించింది. సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటీషన్ ను గురువారం పరిశీలించిన కోర్టు పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. By srinivas 25 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Dastagiri: వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించించింది. ఈ మేరకు తాను అఫ్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి పేరును తొలగించి సాక్షిగా పరిగణించాలని న్యాయస్థానంలో దస్తగిరి పిటీషన్ వేశారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కోర్టుకు వివరించాడు. ఈ క్రమంలో దస్తగిరి వాదనలను పరిగణలోకి తీసుకొని నిందితుల జాబితా నుంచి పేరును న్యాయస్థానం తొలగించింది. #dastagiri #viveka-murder-case సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి