Enforcement Directorate : ఈడీ ఎదుట హాజరైన వివేక్ వెంకటస్వామి ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. By Madhukar Vydhyula 18 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రవేట్ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధుల లావాదేవీలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీస్ కేసుల్లో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అలాగే డిపాజిట్లకు సంబంధించి ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో జరిగిన వ్యవహారంలో కేసు నమోదు చేసిన నగర పోలీసులు నిధుల డిపాజిట్లకు సంబంధించి ఆరాతీస్తున్నారు. ఒక వేళ అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే వివేక్ పై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో సర్వత్ర చర్చనీయంశంగా మారింది. ఎన్నికల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు అక్రమంగా తరలిస్తున్న కోట్లాది రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అవసరమైన డాక్యుమెంట్లు చూపించిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వగా, ఎలాంటి ఆధారాలు లేని డబ్బులను సీజ్ చేసిన అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వరుసగా ఆ కేసులపై దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే వివేక్ వెంకటస్వామిని ఈడీ ముందుకు పిలిచినట్టు తెలిసింది. డిపాజిట్లకు సంబంధించి ఎమ్మెల్యే వివేక్ఇచ్చే వివరణ పై తదుపరి విచారణ ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. #hawala-money #enforcement-directorate #vivek-venkataswamy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి