Vistara Airlines: బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణం హాలిడే వెకేషన్స్ వెళ్ళే వారికి గుడ్ న్యూస్ చెప్పింది విస్తారా ఎయిర్ లైన్స్. బస్ టికెట్ ధరకే విమాన టికెట్లు ఇస్తామని ప్రకటించింది. వచ్చే ఏడాది క్రిస్మస్ వరకు...ఈరోజు నుంచి 23 లోపు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. By Manogna alamuru 21 Dec 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vistara Christmas Sale: అన్నిప్రయాణాల్లోకల్లా విమాన ప్రయాణమే ఖరీదైంది. గాల్లో ఎగిరే విమానం టికెట్ ధరలు కూడా ఆకాశంలోనే ఉంటాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు. కానీ ఇప్పుడు కాదు అంటోంది విస్తారా విమానయాన సంస్థ. క్రిస్మస్ సందర్భంగా భారీ ఆఫర్లను ఇస్తోంది. బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్రిస్మస్ సందర్భంగా కేవలం రూ.1924 కే విమాన టికెట్ అందిస్తోంది. Also Read:హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను కనిపెట్టేశారు డిసెంబర్ 21 అంటే ఈరోజు నుంచి మూడు రోజులు పాటూ అంటే డిసెంబర్ 23 వరకు విస్తారా ఎయిర్ లైన్స్ (Vistara Airlines) సేల్ నడుస్తుంది. దీనిలో డొమెస్టిక్ వన్- వే టికెట్ రేట్లు రూ.1924 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. ఈ రేట్లు దిబ్రుగఢ్- గువాహటి మధ్య ఎకానమీ క్లాస్‌కు వర్తిస్తాయి. అలాగే ఈ రెండు నగరాల మధ్య ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ రేట్లు రూ.2324 ప్రారంభమవుతున్నాయి. అలాగే లగ్జరీ, బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం చూసే వారికి రూ.9924 నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతున్నట్లు విస్తారా తెలిపింది. ఇక అంతర్జాతీయంగా కూడా కొన్ని ప్రదేశాలకు ఆఫర్లు ఇస్తోంది విస్తారా. కాఠ్మాండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, దమ్మమ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు ఎకానమీ క్లాస్‌కు రూ.10,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే ప్రీమియం ఎకానమీ క్లాస్ కు రూ.14,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. బిజినెస్ క్లాస్ కి ఢిల్లీ నుంచి ఢాకా మధ్య రూ.29,999గా ఉన్నాయి. ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇస్తోంది విస్తారా ఎయిర్ లైన్స్. ఈ క్రిస్మస్ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ పండుగ సీజన్‌తో పాటు వచ్చే ఏడాది 2024, సెప్టెంబర్ 30 వరకు జర్నీ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు విస్తారా తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు జర్నీ ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఫేర్స్ దక్కించుకోవచ్చు. బుకింగ్ విండో డిసెంబర్ 21 అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23, 2023 అర్ధరాత్రి 23:59 తో ముగుస్తుంది. సో త్వరపడండి...వెకేషన్ కు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి...టికెట్లు బుక్ చేసుకోండి అని చెబుతోంది విస్తారా. #airlines #vistara #vistara-airlines #tickets సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి