విజయ్ బాటలో విశాల్.. పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఇటీవలే విజయ్ పొలిటికల్ పార్టీ స్థాపించగా ఇప్పుడు విశాల్ కూడా సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ నిర్వాహకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. By srinivas 07 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Tamil Nadu : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా సీని హీరోలు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ (Kamal), రజనీకాంత్ (Rajanikanth) లతోపాటు పలువురు రాజకీయాలపై ఆసక్తి చూపించగా.. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం బరిలోకి దిగుతున్నారు. విజయ్ బాటలో.. ఈ మేరకు ఇటీవలే స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతేకాదు 'తమిళగ వెట్రి కజగం' అంటూ తన పార్టీ పేరుకూడా ప్రకటించడం విశేషం. కాగా ఇప్పుడు మరో నటుడు విశాల్ (Vishal) సైతం రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’.. మొదటి నుంచి రాజకీయాలపట్ల ఆసక్తి చూపుతున్న విశాల్.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్ రిజెక్ట్ చేశారు. దీంతో అభిమాన సంఘాన్ని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’(విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించారు.బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు విశాల్ అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో విశాల్ మక్కల్ నల ఇయక్కం నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది కూడా చదవండి : Under-19 : ఇంకొక్క అడుగే.. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ లోక్‌సభ ఎన్నికల బరిలో.. అంతేకాదు వారితో మాట్లాడి పార్టీని విశాల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విజయ్‌లాగే విశాల్ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నట్లు విశ్లేషకులు చర్చిస్తున్నారు. #tamil-nadu #hero-vishal #political-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి