విశాఖ ఘటన..స్కూల్ ఆటోలపై ఆర్టీవో అధికారులతో కలిసి RTV స్పెషల్ డ్రైవ్.! అనకాపల్లి జిల్లాలో స్కూల్ ఆటోలపై ఆర్టీవో అధికారులతో కలిసి Rtv స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ పిల్లలతో ఆర్టీవో అధికారులు మాట్లాడుతూ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 24 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి అనకాపల్లి జిల్లాలో స్కూల్ ఆటోలపై ఆర్టీవో అధికారులతో కలిసి Rtv స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ప్రధాన జంక్షన్లో ఆర్టీవో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పరిమితికి మించి స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోలను ఆపి ఫైన్ విధిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తున్న స్కూల్ ఆటో డ్రైవర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ పిల్లలతో ఆర్టీవో అధికారులు మాట్లాడుతూ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన ఆటోలకు మొదటిసారి ఫైన్ విధించి తరువాత ఆటోలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. Also Read: హీరో బాలకృష్ణకు ఎమ్మెల్సీ సునీత మాస్ వార్నింగ్.! మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద స్కూల్ విద్యార్థులతో ఆటోను రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు వెళ్తోంది. ఆటో డ్రైవర్ రాష్ గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా లారీ ఢి కొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డుపై రక్తపు మడుగులో విలవిల్లాడారు చిన్నారులు. వెంటనే అలర్ట్ అయ్యారు స్ధానికులు. పోలీసులు, అంబులెన్స్‌కి కాల్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆటో ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకున్నారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. పోలీసులు స్కూల్ ఆటోలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆటో డ్రైవర్లను హెచ్చరిస్తున్నారు. ఫైన్లు కూడా విధిస్తున్నారు. ఆటోలు, బస్సుల్లో స్కూళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ఆలోచించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆటోల్లో విద్యార్థులను పరిమితికి మించి తీసుకువళ్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. వేగంగా వెళ్తుండటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా బస్సులు, వ్యాన్ల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలను చూస్తే.. ప్రజలు కూడా ఫోటోలు తీసి ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా తమకు పంపాలంటున్నారు #vishaka #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి