టోర్నీ మొత్తంలో ఆ వికెట్టే నాకు సంతృప్తినిచ్చింది.. ప్యాట్‌ కమిన్స్‌

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ వికెట్ పడగొట్టిన ఆనంద క్షణాలను ఎప్పటికీ మరిచిపోనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. తన జీవితంలో అత్యంత అద్భుతమైన, కీలకమైన క్షణం అదే అన్నారు. ఆ క్షణాలను తాను చాలా కాలం పాటు ఆస్వాదిస్తానని చెప్పారు.

New Update
టోర్నీ మొత్తంలో ఆ వికెట్టే నాకు సంతృప్తినిచ్చింది.. ప్యాట్‌ కమిన్స్‌

2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 6వసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మొదట్లో చివరి ప్లేస్ లో ఉన్న తమ టీమ్ పక్కా ప్రణాళికతో ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ విజేతగ నిలవడం అద్భుతమని పొగిడేశాడు. అలాగే ముఖ్యంగా ఫైనల్ లో విరాట్ కోహ్లీ వికెట్ తీయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

Also read :ఆ సినిమా కోసం బన్నీ రూ.300 కోట్లు తీసుకుంటున్నాడా?

మెల్‌బోర్న్‌లో ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్‌ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో విరాట్ వికెట్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అంతేకాదు జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు ఆ వికెట్ గుర్తొస్తుంది అన్నారు. ‘70ఏళ్లు దాటిన తర్వాత మీరు జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారు? అని కమిన్స్‌ను యాంకర్‌ ప్రశ్నించారు. దీంతో ‘విరాట్‌ కోహ్లీ వికెట్‌ గురించి ఆలోచిస్తా’ అని సమాధానమిచ్చారు. తన జీవితంలో అత్యంత అద్భుతమైన, కీలకమైన క్షణం అదేనన్నారు. ఆ సమయంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. వికెట్‌ తీసిన తర్వాత మేమంతా ఒకచోటుకి చేరుకున్నప్పుడు స్టీవ్‌ స్మిత్‌ ఓ మాట చెప్పాడు. ‘ఒక్కసారి మైదానాన్ని చూడండి’ అన్నాడు. ఆ క్షణం స్టేడియంలో దాదాపు లక్ష మంది భారత అభిమానులున్నారు. వారంతా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణాలను నేను చాలా కాలం పాటు ఆస్వాదిస్తాను' అని కమిన్స్‌ చెప్పారు. ఇక 28.2 ఓవర్లలో 148/3తో భారత్‌ కుదురుకుంటున్న సమయంలో.. టీమ్‌ఇండియాను కమిన్స్‌ గట్టి దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్‌లో అతడు వేసిన షార్ట్‌ లెంగ్త్‌ డెలివరీని కోహ్లీ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌ను ముద్దాడి స్టంప్స్‌ను తాకింది. దీంతో కోట్లాది అభిమానుల గుండెలు ఆగినంత పనైంది. ఇప్పటికీ ఆ మూమెంట్ గుర్తుస్తే క్రికెట్ లవర్స్ ఎమోషనల్ అవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు