Viral Video : మహిళకు జీవన్ రెడ్డి చెంపదెబ్బ.. కాంగ్రెస్‌ దురహంకారమన్న కేటీఆర్

కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ మహిళను చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఫైర్ అవుతున్నాయి. అయితే.. తాను ఆప్యాయంగానే కొట్టానంటూ వివరణ ఇచ్చుకున్నారు జీవన్ రెడ్డి.

New Update
Viral Video : మహిళకు జీవన్ రెడ్డి చెంపదెబ్బ.. కాంగ్రెస్‌ దురహంకారమన్న కేటీఆర్

KTR : పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) లకు మరికొన్ని రోజుల ముందు తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) మరో దుమారం చోటు చేసుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్(Congress) అభ్యర్థి జీవన్ రెడ్డి వివాదంలో చుట్టుకున్నారు. ఓ మహిళను చెంపమీద జీవన్ రెడ్డి(Jeevan Reddy) కొడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఈ అంశంపై ఫైర్ అవుతున్నారు. ఇది కాంగ్రెస్‌ దురహంకారమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read : క్రిశాంక్‌ను పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు

వివాదం ముదరడంతో జీవన్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అప్యాయంగానే అలా కొట్టానని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆర్మూర్ నియోజకవర్గంలో శుక్రవారం జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళతో ఆయన మాట్లాడారు. తనకు పెన్షన్ రావడం లేదని ఈ సందర్భంగా ఓ మహిళ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎవరికీ ఓటు వేశావంటూ మహిళ చెంపపై కొట్టారు జీవన్ రెడ్డి.

Advertisment
Advertisment
తాజా కథనాలు