Vinesh : భారత్‌కు రజతం లేదు..వినేశ్ కేసు కొట్టేసిన సీఏఎస్

వినేశ్ ఫోగాట్‌కు, భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన వినేశ్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సీఏఎస్ కోర్టు డిస్మిస్ చేసేసింది. దీంతో ఆమె పతకం మీద పెట్టుకున్న ఆశలన్నీ చెల్లాచెదురు అయ్యాయి.

New Update
Vinesh : భారత్‌కు రజతం లేదు..వినేశ్ కేసు కొట్టేసిన సీఏఎస్

Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు, భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురయిన వినేశ్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సీఏఎస్ కోర్టు కొట్టేసింది. ఇది ఆర్డర్ తాలూకా ఆపరేటివ్ భాగమని తెలుస్తోంది. మరి కొంత సేపటిలో వివరణాత్మకంగా కోర్టు ఆర్డర్ వస్తుందని తెలుస్తోంది. దీనికి సబంధించిన ఆర్డర్ కాపీ కూడా ఇచ్చింది.

publive-image

వినేశ్ ఫోగాట్ తీర్పును కాస్ తిరస్కరించిన విషయం భారత ఒలింపిక్ సంఘం కూడా ధృవీకరించింది. వినేశ్ అప్పీల్‌ను కోర్ట్ ఆప్​ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. ఈ తీర్పుతో తాను చాలా నిరాశ చెందానని చెప్పారు.

100 గ్రాముల అధిక బరువు కారణంగా 50 కేజీల రెజ్లింగ్‌ ఫైనల్ ఫైట్‌కు దూరమైన వినేశ్ ఫోగాట్.. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు తనకు పతకం (Silver Medal) ఇవ్వాలంటూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. దీంతో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చేసిన విజ్ఞప్తిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తాత్కాలిక విభాగం దీని మీద విచారణ చేపట్టింది. సెమీస్ లో తన చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిపి తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేసింది. వినేష్‌ తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియాలు కేసును వాదించారు.

Also Read: Karnataka: ఎస్‌బీఐ, పీఎన్‌బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు