Vinesh Phogat: రాజకీయాల్లోకి వినేశ్ ఫోగాట్.. ఆ పార్టీనుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో!? భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వినేశ్‌కు తన సోదరి బబితా ఫోగాట్‌తో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. By srinivas 20 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Haryana: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సోదరి బబిత ఫొగాట్‌పై ఆమెను నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో రెజ్లర్ బజ్‌రంగ్ పునియా కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. వినేశ్ వర్సెస్ బబితా ఫోగాట్.. ఈ మేరకు ఫోగాట్ రాజకీయ ఆరంగేట్రంపై ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ అమ్మాయి రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ వర్సెస్ బబితా ఫోగాట్ మధ్య పోటీ కూడా ఉండే అవకాశం లేకపోలేదన్నారు. 'వినేశ్ రాజకీయాల్లోకి రానని గతంలో ప్రకటించింది. కానీ పలు రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారనేది ఇప్పుడే చెప్పలేం'అంటూ చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: AP News: పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్.. రియల్టర్‌తో రాసలీలలు! ఇక ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. వినేశ్‌ను కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు పంపాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వినేశ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే వినేశ్ సోదరి బబితా ఫోగాట్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక హరియాణాలో అక్టోబరు 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. #vinesh-phogat #political-entry #haryana-assembly-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి