Chevireddy bhaskar reddy: ఇది ఒక గొప్ప కార్యక్రమం..దేశంలో ఏ ఒక్కరూ చేయలేరు! చంద్రగిరి నియోజక వర్గంలో వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కలిసి పర్యావరణ హితమైన కాగితంతో తయారైన 1,060 వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. By Bhavana 16 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలు అయ్యాయి. చంద్రగిరి నియోజక వర్గంలో వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కలిసి పర్యావరణ హితమైన కాగితంతో తయారైన 1,060 వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి హాజరయ్యారు. వినాయక విగ్రహాలకు ముందుగా పూజలు నిర్వహించారు. చంద్రగిరి నియోజక వర్గంలో ప్రతి పంచాయితీలోని గ్రామాలకు ఈ విగ్రహాలను అందజేస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు. గత సంవత్సరం నుంచి ఈ విగ్రహాలను తయారు చేసి పంచిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. హిందూ ధర్మం పెంపొందేలా చెవిరెడ్డి కృషి చేస్తున్నారని టీటీడీ ఈవో కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారికి స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి వినాయక విగ్రహాలను అందించడం ఒక బృహత్తర కార్యక్రమమని ఆయన తెలిపారు. చెవిరెడ్డి భక్తితత్వంలో బాహుబలి అని కొనియాడారు. 1060 విగ్రహాల పంపిణీ, 1లక్షా 15 వేల మట్టి విగ్రహాల తయారీని వారు పరిశీలించారు. ఈ విగ్రహాలను తీసుకుని వెళ్లేందుకు తిరుచానూర్ మార్కెట్ యార్డుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. #ap #tirupati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి