Chhaava Teaser : గూస్ బంప్స్ తెప్పిస్తున్న రష్మిక కొత్త సినిమా 'చావా' టీజర్.. యుద్ధ వీరుడిగా బాలీవుడ్ హీరో రష్మిక మందన, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్లో వికీ కౌశల్ యుద్ధ వీరుడిగా అదరగొట్టారు. రష్మిక మందన కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. By Anil Kumar 19 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Chhaava Movie Teaser : బాలీవుడ్ లో మరో బయోపిక్ రాబోతుంది. ఈ బయోపిక్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన సైతం ప్రధాన పాత్ర పోషించింది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరే 'చావా'. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో వికీ కౌశల్ యుద్ధ వీరుడిగా అదరగొట్టారు. ఆయన యుద్ధ వీరతాన్ని, ధైర్యాన్ని తెరపై చూపించారు. రష్మిక మందన్నా కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. Also Read :కంగువా Vs వేట్టయాన్.. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్న రజినీ, సూర్య..! అక్షయ్ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. గత ఏడాది రణ్ బీర్ కపూర్ సరసన నటించిన 'యానిమల్' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక నుంచి వస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడంతో సౌత్ లోనూ ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. #rashmika-mandanna #chhaava-movie-teaser సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి