అర్బన్ ఓటర్ల నిర్లక్ష్యంపై వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

గ్రేటర్ హైదరాబాద్ లో నెమ్మదిగా పోలింగ్ జరగడంపై ఎన్నికల ప్రధానాధికారి సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. గ్రామాల్లో ప్రజలు తమ ఓటు వేసేందుకు ఉత్సాహంగా కదిలివచ్చారు. అయితే అర్బన్ ఏరియాల్లో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

New Update
అర్బన్ ఓటర్ల నిర్లక్ష్యంపై వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ 40 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. పల్లెల్లో తెల్లారగానే ఓటర్లు పోలింగ్ సెంటర్ల వద్ద ఉత్సాహంగా క్యూ కట్టారు. అయితే ఎప్పటిలాగే పట్టణ వాసులు నెమ్మదిగా కదులుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో 20 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం విశేషం. అయితే అర్బన్ ఏరియాల్లో పోలింగ్ గణాంకాలపై మీడియాతో మాట్లాడిన ఎన్నికల ప్రధానాధికారి సీఈవో వికాస్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు వికాస్ (Vikas Raj) రాజ్ మాట్లాడుతూ.. కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. 'ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చాల్సివచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పలువురు నేతలపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తాం. ఇక గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా కదిలివచ్చారు. అయితే అర్బన్ ఏరియాల్లో పరిస్థితిమాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకూ కేవలం 21 శాతామే ఓట్లు పడ్డాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం' అన్నారు.

Also read : తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి కిషన్‌రెడ్డి కంప్లైంట్‌.!

ఇక గతంలోనూ హైదరాబాద్ (Hyderabad) వాసుల ఓటింగ్ గణాంకాలు పెద్దగా ఆశించినంతగా లేవు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మందికి పైగా జనం నివసిస్తుండగా హైదరాబాద్ పరిధిలోనే 9 లక్షల మందికిపైగానే ఓటర్లు ఉన్నారు. వాళ్లందర్నీ పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. మహానగరంలో ప్రతిసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం 50 శాతానికి మించి దాటడం లేదు. గ్రేటర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం మాత్రమే పోలింగ్ నమోదవగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతానికే పరిమితమైంది. 2020 గ్రేటర్ హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో 46 శాతం ఓటర్లే కేంద్రాలకు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకు పోలింగ్‌ నమోదైతే.. హైదరాబాద్‌లో మాత్రం గణనీయంగా పతనమవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓటింగ్‌ శాతం పెంచేలా అధికారులు పక్కా ప్రణాళికలతో పనిచేశారు. విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. ఓటుహక్కు ఇంపార్టెన్స్‌ తెలియజేస్తూ ప్రచారం చేశారు. అయినా జనాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

అయితే అత్యధికంగా శేరిలింగంపల్లి 7 లక్షల 32వేలకు పైగా ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌ 6 లక్షల 99 వేలకు పైగా ఓటర్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. మేడ్చల్‌లో 6 లక్షల 40 వేలు, ఎల్బీనగర్‌లో దాదాపు 6 లక్షలు. రాజేంద్రనగర్‌ 5 లక్షల 80 వేల మందికిపైగా ఓటర్లతో టాప్‌ ఫైవ్‌ ప్లేస్‌లో నిలిచాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 2 లక్షల 26 వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. థర్డ్‌జెండర్‌ ఓటర్లు 12 వందల మందికిపైగా ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు