BREAKING: హస్తం గూటికి విజయశాంతి.. కాంగ్రెస్ కీలక నేత సంచలన ప్రకటన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. By V.J Reddy 11 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Vijaya Shanthi Likely To Join Congress: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ప్రచారంలో దూసుకుపోతున్న తెలంగాణ బీజేపీకి (BJP) బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలందరూ ఒక్కరొక్కరుగా ఆ పార్టీకి రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరుతున్నారు. అయితే బీజేపీలో ఈ వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కేసీఆర్ పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy), వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy) తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. ఇదే తరహారలో ఇంకో నేత కూడా ఉన్నట్లు సమాచారం. ALSO READ: కీచక టీచర్లు.. స్కూల్ టాయిలెట్‌లో 6వ తరగతి బాలికను ఏం చేశారంటే? బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijaya Shanthi) కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేకా వెనకటస్వామి బాటలోనే నడవాలని నిశ్చయించుకుందట. గత కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న విజయశాంతి త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి హస్తం (Congress) గూటికి చేరుతుందని తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఇవాళ కాంగ్రెస్ కీలక నేత మల్లు రవి (Mallu Ravi) కీలక ప్రకటన చేశారు. విజయశాంతి తమతో టచ్ లో ఉన్నారని.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు. దీంతో విజయశాంతి పార్టీ మారుతుందనే జరుగుతున్న ప్రచారానికి మల్లు రవి ఆజ్యం పోశారు. మరి నిజంగానే విజయశాంతి పార్టీ మారుతారా? లేదా? అనేదానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ALSO READ: దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా! #congress #bjp #telangana-elections-2023 #vijaya-shanthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి