Big Breaking: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. By Nikhil 19 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ ను (Chandrababu Naidu's judicial remand) విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) మరోసారి పొడిగించింది. నవంబర్ ఒకటి వరకు రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ సందర్భంగా జడ్జి చంద్రబాబుతో మాట్లాడారు. తన సెక్యూరిటీ విషయంలో కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా జడ్జికి తెలిపారు. ఏమైనా అనుమానాలుంటే రాతపర్వకంగా ఇవ్వాలని జడ్జి సూచించారు. ఇది కూడా చదవండి: Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. మెడికల్ రిపోర్టులను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని జడ్జి అడగగా.. తనకు ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ మెడికల్ టీం ఉందా? చెక్ చేస్తున్నారా? అని అడగగా చెకప్ చేస్తున్నారని చంద్రబాబు చెప్పారని సమచారం. స్కిల్ డవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు దాదాపు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ పై సీఐడీ 900 పేజీలతో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలు విననుంది హైకోర్టు. ఇది కూడా చదవండి: Margadarshi Case: మార్గదర్శికి ఊరట.. ఆ పిటిషన్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనుంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా మరికొన్ని రోజులు ఆయన జైలులోనే ఉంటారా? అన్న అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #chandrababu #acb #ap-skill-development-case #acb-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి