Vijayasai Reddy : టీడీపీ నాశనానికి కారణం ఇదే : విజయసాయి రెడ్డి

టీడీపీని నాశనం చేసేది వైసీపీ కాదు.. చంద్రబాబు స్వయంగా తన చేతలతో తనే పార్టీని భ్రష్టు పట్టించారని విజయసాయి విమర్శలు గుప్పించారు. చివరిసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనే ఆరాటంతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ట్విట్టర్ లో మండిపడ్డారు.

New Update
Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత

Vijayasai Reddy : ఏపీ అసెంబ్లీ ఎన్నికల(AP Assembly Elections) కోసం టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి కట్టడంపైనా నెల్లూరు ఎంపీ అభ్యర్ధి విజయసాయి రెడ్డి(Nellore MP Vijaya Sai Reddy) విమర్శలు గుప్పించారు. ఎన్నికలు పూర్తయి వైసీపీ(YCP) గెలిచాక రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉనికిలో లేకుండా పోతుందని ట్టిట్వర్ లో పేర్కొన్నారు. కూటమి ఉండేది నాలుగు రోజులే అయినా సరే దీనికి కొన్ని పేర్లు సూచిస్తానని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ‘ట్రిపుల్ యూ టర్న్, ది డిస్కార్డ్ కన్సార్టియం, ట్రిపుల్ డైలమా అలయెన్స్, టగ్ ఆఫ్ వార్ ట్రయంవేర్, త్రీ స్టెప్స్ బ్యాక్ వర్డ్ అంటూ పేర్లు సూచించారు.

Also Read : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్ రెడ్డి

ఈ క్రమంలోనే మరో ట్విట్ చేశారు. టీడీపీని నాశనం చేసేది వైసీపీ కాదని, చంద్రబాబు చేసిన పనులే ఆ పార్టీని నాశనం చేశాయని పేర్కొన్నారు. చంద్రబాబు స్వయంగా తన చేతలతో తానే పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శలు గుప్పించారు. చివరిసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనే ఆరాటంతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి!


పదవి కోసం పార్టీ ఐడియాలజీని పక్కనపెట్టి, పార్టీ క్యాడర్ ను తనను నమ్ముకున్న నేతలను మోసం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగేళ్ల క్రితం చెప్పిన మాటలను, కార్యకర్తలకు కలిగించిన భరోసాను చంద్రబాబు వమ్ము చేశారని ఫైర్ అయ్యారు. అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించాలా.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు