Vijay Devarakonda : 'కల్కి' కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు?

'కల్కి' సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం విజయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తన ఫ్రెండ్ నాగ్ అశ్విన్ కోసమే ఈ చిత్రంలో నటించాడట.

New Update
Vijay Devarakonda : 'కల్కి' కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు?

Vijay Devarakonda Remuneration: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD Movie). భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడులైంది. రిలీజ్ కు విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ తర్వాత కూడా అదే క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి రికార్డు వసూళ్లను రాబడుతోంది.

తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.190 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. అటు ఓవర్ సీస్ లో కూడా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కల్కి క్లైమాక్స్ లో అర్జునుడి పాత్రలో రౌడీ హీరో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సినిమా చివరిలో ఐదు నిమిషాల పాటు కనిపిస్తాడు. నిడివి తక్కువే అయినా ఆ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.

Also Read : నేను, శంకర్ ‘రోబో’ చేయాలని అప్పట్లోనే అనుకున్నాం.. కానీ : కమల్ హాసన్

కల్కి లో చాలామంది గెస్ట్ రోల్స్ చేశారు. కానీ వాళ్లందరిలో బాగా హైలైట్‌ అయింది మాత్రం విజయ దేవరకొండ పాత్ర అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే అంశమై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. విజయ్‌ (Vijay Devarakonda) ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట.

తన ఫ్రెండ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట. పార్ట్‌ 2లోనూ విజయ్‌ పాత్ర కనిపించబోతుంది. విజయ్‌ ఒక్కడే కాదు సినిమాలో గెస్ట్‌ రోల్స్ చేసిన చాలా మంది ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోలేదట. కేలవం నాగ్‌ అశ్విన్‌, వైయంజతీ మూవీస్‌ బ్యానర్‌పై ఉన్న గౌరవంతోనే సినిమాలో నటించారట.

Advertisment
Advertisment
తాజా కథనాలు