Vijay, Rashmika: విజయ్,రష్మిక..సంథింగ్ సంథింగ్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందాన(rashmika mandanna) మధ్య సంథింగ్ సంథింగ్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నరంటూ నెట్టింట్లో నెటిజన్స్ హల్‌చల్ చేస్తున్నారు. నిజంగా వాళ్లు రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు..కానీ, నెటిజన్లు మాత్రం వీరి ఫొటోలతో హంగామా సృష్టింస్తున్నారు.

New Update
Vijay, Rashmika: విజయ్,రష్మిక..సంథింగ్ సంథింగ్..!

Vijay Deverakonda and Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందాన(Rashmika mandanna) మధ్య సంథింగ్ సంథింగ్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నరంటూ నెట్టింట్లో నెటిజన్స్ హల్‌చల్ చేస్తున్నారు.

ఇటీవల రష్మిక తన మేనేజర్​ పెళ్లి వేడుకలో ఎల్లో శారీలో మెరిసింది. అమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్​ అయ్యాయి. అయితే రష్మిక ఫోటీ దిగిన సేమ్ ఫ్లేస్‌లోనే విజయ్ దేవరకొండ రిలాక్స్ అవుతున్న ఫోటో పోస్ట్ చేసాడు. ఇక ఆ ఫోటో ని జత చేసి..ఈ రెండు ప్లేసులు ఒకటేనని..వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నారని.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తు వీరి ఫొటోలు వైరల్​ చేస్తున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. ఆ ఫోటోకి విజయ్ దేవరకొండ ఇచ్చిన కాప్షన్ ఎంటంటే.. ''జీవితంలో చాలా జరుగుతున్నాయి. అయితే, ఇది మాత్రం చాలా స్పెషల్! త్వరలో అనౌన్స్ చేస్తా'' అని పేర్కొన్నారు. దాంతో ఆయన ప్రేమ, పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

నిజంగా వాళ్లు లివింగ్ రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు..కానీ, నెటిజన్లు మాత్రం వీరు రిలేషన్‌లో ఉంటున్నారని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కచ్చితంగా వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని.. అదే ఇంట్లో కాపురం పెడుతున్నట్టు మనకు మళ్ళీ షాక్ ఇస్తారని కూడా అంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కలిసి రెండు చిత్రాలు చేశారు. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ సాధించి బాక్స్ ఆఫీస్ ను బద్దలగొట్టింది. డియర్ కామ్రేడ్ లోనూ వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది.

అయితే, రష్మిక పుష్ప 2 (Pushpa 2) సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అని ఫ్యాన్స్  అనుకుంటున్నారు. గతంలో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోలో కూడా వైరల్ అయ్యాయి. విజయ్ తో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక కూడా ఒప్పుకుంది. విజయ్ నాకు గుడ్ ఫ్రెండ్, అతనితో ట్రిప్ కి వెళితే తప్పేంటని ప్రశ్నించింది. తను విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి కూడా బాగా క్లోజ్ అని తెలిపింది. మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే  ఉంది తప్ప ఎఫైర్, లవ్ లేదని రష్మిక పలుమార్లు వెల్లడించారు. నిజంగా వాళ్లు లివింగ్ రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు..కానీ, నెటిజన్లు మాత్రం వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు.

Also Read:జైలర్ నటుడు కన్నుమూత..సెలబ్రెటీల సంతాపం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ తో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

New Update


బాహుబలి, RRR రికార్డులు బద్దలు 

హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో 23మిలియన్ల వీక్షణాలను సంచలనాత్మక రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి రికార్డులను సైతం బీట్ చేసి.. యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా కొనసాగుతోంది.  ఆకర్షణీయమైన కథనం,  మైండ్-బ్లోయింగ్ యాక్షన్ షాట్‌లతో ట్రైలర్  ఆసక్తికరంగా  ఉంది. నాని  స్క్రీన్ ప్రెజెన్స్ భయానకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనిపించింది. భయంకరమైన పోలీస్ అధికారిగా అదరగొట్టారు నాని.  'హిట్3' మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిలెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన  ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథనాయికగా నటించగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

telugu-news | latest-news | cinema-news

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment