Family Star: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ .. టైటిల్ కి తగ్గట్టే టీజర్  

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా టీజర్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ లో ఉంది. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలున్నాయి. 

New Update
Family Star: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ .. టైటిల్ కి తగ్గట్టే టీజర్  

Family Star: కొన్ని కాంబినేషన్స్ భలే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయి. అటువంటిదే విజయ్ దేవరకొండ.. పరశురామ్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం భారీ విజయాన్ని సాధించింది. విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ హీరో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తరువాత విజయ్ కు సరైన హిట్ దొరకలేడు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఫ్యామిలీ స్టార్(Family Star) గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 

Also Read: గామి ట్రైలర్ సూపర్.. కానీ ప్రమోషన్స్ లో మాటల అతి అవసరమా విశ్వక్ సేనా?

ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే.. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఉన్నట్టు అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ లుక్స్ మన పక్కింటి అబ్బాయిని చూస్తున్నట్టుగా అనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. టీజర్ బ్యాగ్రౌండ్ లో వినిపించిన పాట కూడా సినిమా లైన్ ని రివీల్ చేస్తున్నట్టుగా ఉంది. విజయ్ దేవరకొండ మరోసారి గీతా గోవిందం రేంజ్ లో డీసెంట్ గా కనిపిస్తున్నాడు. అలా అని సినిమాలో యాక్షన్ లేదని అనుకోవద్దు అన్నట్టుగా కొన్ని యాక్షన్ బిట్స్ కూడా కట్ చేశారు. అవి కూడా కొత్తగా కనిపించాయి. విజయ్ దోశలు వేస్తున్న కట్.. పిల్లల దగ్గర తలపాగా చుట్టుకుంటూ చేస్తున్న ఫైట్ ఆకట్టుకున్నాయి. టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ నిర్మిస్తున్న ఈ సినిమా(Family Star) ఏప్రిల్ 5, 2024న తెలుగు, తమిళం,హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు