ఆ అవమానం తట్టుకోలేకపోయా.. ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయమేసింది బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ తనకు కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది. రెండు కమర్షియల్ సినిమాల్లో తాను పోషించిన క్యారెక్టర్‌ల కారణంగా తనను ప్రేమించిన వారే దారుణంగా విమర్శించారని చెప్పింది. దీంతో కొంతకాలం ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయమేసిందని తెలిపింది. By srinivas 11 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ తనకు కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ ఊహించని సంఘటన తనను చాలా భయాందోళనకు గురిచేసినట్లు చెప్పింది. దీంతో అవమానం తట్టుకోలేక కొంత కాలం ఇంట్లోనుంచి బటయకు రావాలంటే భయమేసిందంటూ ఎమోషనల్ అయింది. ‘నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా నాకు నేను నచ్చేదాన్ని కాదు. దీంతో బయటకెళ్లినపుడు ఎలా కనిపించాలి? ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో అందరూ నన్నెంతో ఆదరించారు’ చెప్పింది. Also read :కీచక టీచర్లు.. స్కూల్ టాయిలెట్‌లో 6వ తరగతి బాలికను ఏం చేశారంటే? అయితే తాను నటించిన రెండు కమర్షియల్ సినిమాలు విడుదలయ్యాక.. తనను ప్రేమించిన వారే విమర్శించడం మొదలుపెట్టారని తెలిపింది. ఆ పాత్రలకు నేను సరిగ్గా సెట్ కాలేదని, అధిక బరువు ఉన్నానని ఎగతాళి చేశారని చెప్పింది. నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాలేదని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఓ ఫంక్షన్‌లో వరెస్ట్ డ్రెస్సింగ్ అవార్డుకు నన్ను ఎంపిక చేశారు. అది నన్నెంతో బాధించింది. చుట్టుపక్కల వాళ్లు ఎలా చూస్తారనే భయం, బాధతో ఇంట్లో నుంచి బయటకు కూడా రావాలనిపించలేదు. ఆ ఘటన నన్నెంతో బాధకు గురి చేసింది. అదృష్టవశాత్తు ఆరోజుల్లో సోషల్‌మీడియా లేదంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడింది విద్యాబాలన్. #vidya-balan #shared #bitter-experiences #her-career మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి