క్రైం Police Attack: ఎయిర్ పోర్టులో పోలీసుల క్రూరత్వం.. ప్రయాణికులపై అమానుష దాడి! బ్రిటన్లోని మాంచెస్టర్ ఎయిర్పోర్టులో దారుణం జరిగింది. ఎమర్జెన్సీ సిబ్బందితో గొడవకు దిగిన నలుగురు ప్రయాణికులను పోలీసులు విచక్షణ రహింతగా కొట్టారు. కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి, తలలపై తన్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టగా ఒక పోలీసును సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal News: హనుమకొండలో హైటెన్షన్.. అసలేమైందంటే? హనుమకొండలో డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి అందులో ఉంటున్న పేదలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాము గుడిసెల్లో ఉండలేకపోతున్నామని పేదలు ఆందోళనకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విద్యుత్ అధికారులకు హ్యాట్సాఫ్ చెప్పిన రైతు- VIDEO పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దమ్మపేట మండలం గుమ్మడివల్లి, నందిపాడు, కోయరంగాపురం, 29 గిరిజన ఆవాస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో 2 రోజులుగా టీజీఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఉజ్జయిని మహంకాళికి పొన్నం ఫ్యామిలీ తొలి బోనం బోనాల పండగ సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి తొలి బోనాన్ని సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bandi Sanjay: ఏం సాధించారని సంబరాలు?.. డ్రామాలు ఆపండి: బండి ఫైర్ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి.. ఆ నిధులతో రుణమాఫీ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకే ఈ డ్రామా అని విమర్శించారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao: మళ్లీ చెబుతున్నా.. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధం: రేవంత్ కు హరీష్ సవాల్ ప్రభుత్వం ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా.. అని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నా బిడ్డకు తండ్రి అతనే.. లైవ్ లో శాంతి, మదన్ మాటల యుద్ధం! దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆమె భర్త మదన్ మోహన్ మధ్య ఆర్టీవీ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. తన బిడ్డకు తండ్రి సుభాషే అని శాంతి మరో సారి తేల్చి చెప్పగా.. కాదు విజయసాయిరెడ్డే అంటూ మదన్ మోహన్ వాదించారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ అయ్యో అన్నదాత.. కలెక్టర్ ఆఫీసులో వృద్ధ రైతు పొర్లు దండాలు! మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్సౌర్ కు చెందిన ఓ రైతు తన భూమిని కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ ఆఫీసుకు వచ్చాడు. అక్కడ అతనిని అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలా పొర్లు దండాలు పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP Roja: పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్న రోజా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు! తనతో సెల్ఫీ తీసుకోవడానికి వస్తున్న పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్నట్లు రోజా సైగలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగా కూడా పని చేసిన రోజా పారిశుధ్య కార్మికులతో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn