Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల విచారణకు సహకరించలేదని, ఏం అడిగిన తెలీదని, గుర్తులేదని సమాధానాలు ఎక్కువగా ఇచ్చారని పోలీసులు తెలిపారు.

New Update
Sajjala: లోకేష్ ఒక జోకర్.. సజ్జల కౌంటర్.!

టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి నేపథ్యంలో.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సజ్జలతోపాటు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా స్టేషన్‌ వద్దకు వెళ్లారు.అయితే విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని న్యాయవాది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ విచారణ సమయంలో పోలీసులు న్యాయవాదిని అనుమతించలేదు. కోర్టు అనుమతి ఉంటే తప్పనిసరిగా విచారణకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్‌​లోకి విచారణకు వెళ్లారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణతో పాటు గ్రామీణ సీఐ శ్రీనివాసరావు కూడా సజ్జలను విచారించారు. కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని విచారణ తర్వాత సజ్జల ఆరోపించారు.

ఇది కూడా చూడండి: Ap: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్‌...ఎవరూ చేశారో తెలుసా!

అసలు విచారణకు సహకరించలేదు..

ఈ కేసులో సజ్జలను విచారించగా అసలు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ముందే ప్రిపేర్ చేసుకున్న 38 ప్రశ్నలు అడిగితే.. చాలా ప్రశ్నలకు గుర్తు లేదు, మర్చిపోయాననే సమాధానాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. గత ప్రభుత్వంలో సజ్జల సలహాదారుగా ఉన్న సజ్జలను ఆధారాలతో ప్రశ్నించాం. కానీ సరిగ్గా స్పందించలేదు. కనీసం మొబైల్‌ అడిగిన ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అడిగిన ప్రశ్నలన్నింటికి వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. ఘటన జరిగిన రోజు అసలు అక్కడ లేనని సజ్జల అంటున్నారు. కానీ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. మూడు నెలల నుంచి కేసు విచారిస్తున్నామని.. నిందితులను అరెస్టు చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుందని కేసును ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది. 

ఇది కూడా చూడండి: Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!

వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో ఈ దాడి జరిగింది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు అయ్యింది. కానీ ఇప్పటి వరకు విచారణ జరపలేదు. అయితే ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆపార్టీ నేతలు నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, దేవినేని అవినాశ్‌‌లను ఇప్పటికే పలుమార్లు పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. 

ఇది కూడా చూడండి: Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించినప్పటికీ ఇప్పటికే సగానికి పైగా మాత్రమే విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసులతో కలిసి తదుపరి విచారణను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 120వ నిందితుడు. నిందితుల జాబితాలో కొన్ని పేర్లు పునరావృతం అయ్యాయని వారిలో అసలు నిందితులను నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు తొలగిస్తామని పోలీసు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

Advertisment
Advertisment
తాజా కథనాలు