Chiranjeevi - Venkatesh - Saindhav : చిరు మూవీపై వెంకీ కామెంట్స్... సైంధవ్ విషయంలో జరిగేది ఇదే!!

విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్ . ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న సైంధవ్ విషయంలో మెగాస్టార్ చెప్పినట్లుగానే జరుగుతుందా?ఇంతకీ వెంకీ , చిరు మధ్య ఏం జరిగింది?

New Update
Chiranjeevi - Venkatesh - Saindhav : చిరు మూవీపై వెంకీ కామెంట్స్... సైంధవ్ విషయంలో జరిగేది ఇదే!!

Chiranjeevi, Venkatesh, Saindhav : విక్టరీ వెంకటేష్(Venkatesh) డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్(Saindhav). ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తండ్రీ కూతురు సెంటిమెంట్ తో శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మెగా స్టార్ చెప్పినట్లుగానే బ్లాక్ బస్టర్ అవుతుందా ? ఇంతకీ వెంకీ , చిరు(Chiranjeevi) మధ్య ఏం జరిగింది?

సెంటిమెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వెంకీ

ఫిలిం ఇండస్ట్రీ(Film Industry) లో ఎలాంటి కాంట్రవర్సీలు లేని హీరో ఎవరూ అంటే విక్టరీ వెంకటేష్ పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఏ హీరో జోనర్ ఏదయినా బాక్స్ ఆఫీస్ లో దుమ్మురేగాల్సిందే. ఇక.. సెంటిమెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్ ఒకానొక టైంలో చిరు నటించిన డాడి సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరు కంబ్యాక్ కాకపోతే వెంకీ హిమాలయాలకి వెళ్లేవారు

చిరు , వెంకీ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికి తెలిసిందే. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ తో కమ్ బ్యాక్ అవకుండా ఉంటె .. ఈపాటికి ఏ హిమాలయాల్లోనో ఉండేవాడినని వెంకీ 75 ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడటంతో చిరు అంటే వెంకీకి ఎంత అభిమానమో యిట్టె అర్ధం అవుతోంది. చిరంజీవిపై ఎప్పుడూ విమర్శలు చేయని వెంకటేష్ డాడీ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడుమాత్రం విమర్శలు చేశారట. చిరంజీవి తను నటించిన డాడీ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ఆనతి సంగతులను చెప్పడం జరిగింది.నేను నటించిన డాడీ సినిమా గురించి వెంకీ ఊహించని కామెంట్ చేశాడని ఆ సినిమా అబవ్ యావరేజ్ గా ఆడిందని చిరంజీవి తెలిపారు.

ALSO READ : Sivaji : మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

డాడీ మూవీ చిరు చేయడం వల్లే హిట్ కాలేదు ,నేను చేస్తే పక్కా హిట్ - వెంకటేష్

ఆ సినిమాలో నేను బాగా చేయలేదని వెంకీ చెప్పాడని నేను నటించాను కాబట్టి డాడీ సోసోగా ఆడిందని అదే సినిమా తను చేసి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేదని ఈ విషయాన్నీ వెంకీ ఫోన్ చేసి మరీ చెప్పాడని చిరంజీవి చెప్పుకొచ్చారు . తండ్రీ కూతురు సెంటిమెంట్ ను తాను బాగా చేస్తాననే కాన్ఫిడెన్స్ తో వెంకటేష్ ఆ మాట చెప్పాడని (Chiranjeevi) చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

సైంధవ్ మూవీ ట్రైలర్ జనవరి 3న రిలీజ్

సైంధవ్ సినిమా కూడా తండ్రీ కూతురు కథతో తెరకెక్కుతున్న నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వెంకీ చెప్పినట్టు చూస్తే సైంధవ్ హిట్ అంటూ మెగాస్టార్ పరోక్షంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. హిట్ ఫ్రాంచైజీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శైలేష్ కొలను సైంధవ్ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించారు. ఎన్నో ప్రత్యేకతలతో రాబోతోన్న సైంధవ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైంధవ్ మూవీ ట్రైలర్ జనవరి 3న రిలీజ్ కానుంది.

ALSO READ : Prabhas : ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా – ప్రభాస్ పోస్ట్ వైరల్!!

Advertisment
Advertisment
తాజా కథనాలు