Hero Ram Charan: గ్లోబల్ స్టార్ కు అరుదైన గౌరవం.. గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ

RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు స్టార్ హీరో రామ్ చరణ్. తాజాగా ఈ హీరోకు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నై కి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈ నెల 13న జరగబోయే స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ డాక్టరేట్‌ అందుకోనున్నారు.

New Update
Hero Ram Charan: గ్లోబల్ స్టార్ కు అరుదైన గౌరవం.. గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ

Hero Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో 'RC16' చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్న 'గేమ్ ఛేంజర్' చివరి దశలో ఉంది. ఇక ఇటీవలే పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైన 'RC16' త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

చరణ్ కు అరుదైన గౌరం

ఇది ఇలా ఉంటే.. చరణ్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ కు .. మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలిసింది.

వేల్స్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

చెన్నై కి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ నెల 13న యూనివర్సిటీ లో జరగనున్న స్నాతకోత్సవ వేడుకల్లో రామ్ చరణ్ ఈ గౌరవ డాక్టరేట్ ను అందుకోనున్నారు. కళా రంగంలో ఆయన అందించిన సేవలకు గానూ ఈ పురస్కారం వరించినట్లు తెలుస్తోంది. ఈ స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.

 Also Read: Rajamouli: ప్రభుదేవా పాటకు రాజ‌మౌళి ఎలా స్టెప్పులు వేశారో చూడండి.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు