Vastu Tips: భార్యభర్తల మధ్య క్లోజ్ నెస్ పెంచే వాస్తు టిప్స్!

కపుల్స్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యాన్ని (Intimacy) పెంచడానికి కూడా కొన్ని వాస్తు సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యాన్ని మెరుగుపరచుకోవడానికి, రిలేషన్‌షిప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి 7 వాస్తు టిప్స్ పాటించాలి. అవేంటంటే..

New Update
Vastu Tips: భార్యభర్తల మధ్య క్లోజ్ నెస్ పెంచే వాస్తు టిప్స్!

వాస్తు శాస్త్రం వివిధ సమస్యలకు పరిష్కారం చూపుతుందని పండితులు చెబుతారు. గృహ నిర్మాణ దోషాలను సరిచేసే ఈ శాస్త్రం, చాలా విషయాల్లో వృద్ధికి బాటలు వేసే పరిహారాలను సైతం సూచిస్తుంది. అయితే కపుల్స్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యాన్ని (Intimacy) పెంచడానికి కూడా కొన్ని వాస్తు సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యాన్ని మెరుగుపరచుకోవడానికి, రిలేషన్‌షిప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి 7 వాస్తు టిప్స్ పాటించాలి. అవేంటంటే..

వాస్తు ప్రకారం.. బెడ్ రూమ్ ఇంట్లో నైరుతి మూలలో ఉండాలి. పడక గది ఈ దిశలో ఉంటే, మీ సంబంధం మరింత స్థిరంగా ఉంటుంది. ఈ దిశ డీప్ కనెక్షన్, పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే గదిలో బెడ్ దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి.బెడ్ రూమ్‌కు వేసే పెయింట్స్, మనసును రీఫ్రెష్ చేసేలా ఉండాలి. కొన్ని రంగులు ప్రశాంతతను, రొమాటింక్ ఫీలింగ్స్‌ను ప్రోత్సహిస్తాయి. అందుకే పడక గదికి వైబ్రంట్ పింక్, స్కార్లెట్, పాస్టెల్ కలర్ పెయింట్స్ వేయించాలి. ఈ రంగులు రొమాంటిక్ మూడ్‌ను ప్రోత్సహిస్తాయి. భాగస్వామిపై కోరిక, ప్రేమను రేకెత్తిస్తూ ఇంటిమసీని ప్రోత్సహించే వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. మూడ్‌ను నెగిటివ్‌గా ప్రభావితం చేసే డార్క్ కలర్స్ వాడకూడదు.

బెడ్‌రూప్ ఎప్పుడూ క్లీన్‌గా, నీట్‌గా ఉండాలి. వస్తువులు చిందరవందరగా పడేయకూడదు. ఇలాంటి వాతావరణం నెగిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ, పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అలాగే అవసరం లేని వాటిని బెడ్‌రూమ్ నుంచి తీసేయాలి. వాడని, చెడిపోయిన, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో పెట్టకూడదు.బెడ్ రూమ్‌లో తక్కువ లైటింగ్‌ ఉండాలి. ఇది సన్నిహిత వాతావరణాన్ని క్రియేట్ చేయవచ్చు. పడక గదిలో లైటింగ్‌ను తగ్గించడానికి బెడ్‌సైడ్ ల్యాంప్స్ లేదా డిమ్మర్ స్విచ్‌లు వాడటం మంచిది.అద్దాలు (Mirrors) శక్తిని రిఫ్లెక్ట్ చేయవచ్చు, విస్తరించవచ్చు. కానీ మంచం పక్కనే అద్దం ఉండకూడదు. దీనివల్ల ప్రజలు అసౌకర్యంగా, రెస్ట్‌లెస్‌గా ఉంటారు. ఇది పడక గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని దూరం చేయవచ్చు. అందుకే బెడ్ దగ్గర అద్దం లేకుండా చూసుకోవాలి.

కొన్ని రకాల సువాసలను జంటల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచగలవు. ఇవి మూడ్‌ను ప్రోత్సహించి, కోరికలను కలగజేస్తాయి. అందుకే రొమాన్స్ ఫీలింగ్స్‌ను ప్రోత్సహించే గులాబీ, జాస్మిన్ లేదా లావెండర్ వంటి ఫ్రాగ్నెన్స్‌ సెంట్లు వాడండి. ఈ అరోమాథెరపీ మీ మూడ్‌ను మారుస్తుంది.భూమి, నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం.. ఐదు అంశాలు సమతుల్యంగా ఉండాలి. దీంతో పడకగదిలో సామరస్యం, పాజిటివ్ వైబ్స్ వృద్ధి చెందుతాయి. మృదువైన దుస్తులు, చెక్క ఫర్నిచర్ వంటి సహజ పదార్థాలతో చేసినవి వాడితే ఎలిమెంట్స్ ఈక్విలిబ్రియం సాధించవచ్చు. ఇవన్నీ జంటల మధ్య సాన్నిహిత్యం కోసం ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు