లావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్‌ అంటే అంత ఇష్టమా?

వరుణ్‌ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్‌ లావ్‌ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్‌ గా మారింది.

New Update
లావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్‌ అంటే అంత ఇష్టమా?

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌ నుంచి మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ బయటకు వచ్చేసి. కొత్త బంధానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్ లిస్టులో ఇప్పుడు వరుణ్‌ అండ్‌ లావణ్య కూడా చేరిపోయారు. నవంబర్‌ 1 ఇటలీలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు అతి తక్కువ మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. టాలీవుడ్‌ నుంచి నితిన్‌ తన భార్య తో కలిసి హాజరయ్యారు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన లావణ్య ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయిపోయింది.

పెళ్లిలో లావణ్య కాంచీపురం ఎర్ర పట్టు చీర కట్టుకున్నారు. అయితే ఈ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ఆమె మేలిముసుగులో పెళ్లి పీటల మీదకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె చీర మీద వరుణ్‌ లావ్ (ఇన్ఫినిటీ) అనే అక్షరాలు ఉన్నాయి. వాటిని లావణ్య ఆ చీర మీద ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించారు.

Also read: ముంచెత్తిన భారీ వర్షం..విద్యా సంస్థలకు సెలవు!

వరుణ్‌ తేజ్‌ ను ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగా వరుణ్‌ అని పిలుస్తారు..లావణ్యా త్రిపాఠిని లావ్‌ అని అంటుంటారు. రెండు ముద్దు పేర్లను కలిపి చీర మీద తెలుగులో రాయించుకుని వాటి పక్కన ఇన్ఫినిటీ సింబల్ పెట్టారు. సోషల్‌ మీడియాలో కూడా వరుణ్‌లావ్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. లావణ్య ఇప్పుడైతే తెలుగింటి కోడలు అయ్యారు కానీ..ఆమె ఇంతకు ముందే తెలుగు రాష్ట్రంలో స్థిరపడిపోయారు.

ఇప్పుడు కూడా చీర మీద ఇలా తెలుగులో వధూవరుల పేర్లు రాయించడంతో లావణ్య మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు భాషకు, ఇక్కడి సంప్రదాయానికి ఆమె ఎంతో గౌరవం ఇస్తున్నారనే చెప్పుకోవాలి. ఆదివారం (నవంబర్‌ 5) నాడు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు కొంతమంది అతిథులకు రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ.

పెళ్లి వేడుక అయిన తరువాత మెగా కుటుంబం నుంచి ఒక్కొక్కరు హైదరాబాద్‌ కి చేరుకుంటున్నారు. పవన్‌ శుక్రవారం నాడే నగరానికి చేరుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్‌ చిరంజీవి, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్‌, వైష్టవ్‌ తేజ్ కూడా వచ్చారు. శనివారం నాడు కొత్త జంట నగరానికి చేరుకుంటుంది.

Also read: దీపావళికి ప్రత్యేక రైళ్లు..అనౌన్స్ చేసిన రైల్వే శాఖ!

Advertisment
Advertisment
తాజా కథనాలు