Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది!

ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది.

New Update
Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది!

ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది. కానీ చిన్నారి పరిస్థితి కూడా విషమం గా ఉన్నట్లు తెలుస్తుంది.

పిలిబిత్‌ కు చెందిన ఓ కుటుంబం వారణాసిలో తమ కుటుంబ సభ్యుల అస్థికలు కలిపి అక్కడి దేవాలయాల్లో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి- లక్నో హైవే పై వారణాసి జిల్లాలో జౌన్ పూర్ ప్రాంతంలో రోడ్డు మీద ఆగి వున్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. చనిపోయిన వారందరినీ కూడా పిండ్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అమన్ (24), విపిన్ యాదవ్ (32), గంగాదేవి (48), మహేంద్ర పాల్ (43), చంద్రకాళి (40), దామోదర్ ప్రసాద్ (35), నిర్మలా దేవి (32), రామ్ భజన్ (55)గా గుర్తించారు.

కాగా ఈ ప్రమాదంలో బయటపడిన ఐదేళ్ల చిన్నారి శాంతి స్వరూప్‌ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉంది. ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

New Update
bike-accident suryapet

bike-accident suryapet

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చెడే జనార్దన్‌కు కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో యశస్విని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే తనకు విద్యాబుద్ధులు నేర్పి తనను ఇంతటి ఉన్నతస్థాయికి చేర్చిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఇటీవల ఆమె కొనుగోలు చేసింది.  ఆ బైక్ ను తీసుకుని హైదరాబాద్ నుంచి తన కొలీగ్ నాగఅచ్యుత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేంది. 

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా

అయితే శనివారం అర్ధరాత్రి 12:30 గంటట సమయంలో ఆకుపాముల వద్ద  నేషనల్ హైవేపై చనిపోయి ఉన్న గేదెను గుర్తించక దానిని ఢీకొని పడిపోయారు. అదే టైమ్ లో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా వెళ్లడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న నాగఅచ్యుత్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడనుంచి పరారయ్యాడు.  బాధితురాలి బాబాయ్ చేడె సురేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

 

Advertisment
Advertisment
Advertisment