Vande Bharat: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కు మరో స్టాప్!
తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఓ ట్రైన్ కి మరో స్టాప్ అదనంగా చేరింది. సికింద్రాబాద్ -విశాఖపట్నం- సికింద్రాబాద్ ట్రైన్ ఇక నుంచి ఏలూరులో కూడా ఆగనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.
Vande Bharat: మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు పలు రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం- సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు అదనంగా మరో స్టాప్ ని చేర్చారు.
ఈ వందేభారత్ రైలు ఇకపై ఏలూరులోనూ ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఇక నుంచి ప్రయాణం సులభతరం కానుంది.
సికింద్రాబాద్ లో ఉదయం 5.05 గంటలకు బయల్దేరే ఈ వందేభారత్ రైలు ఏలూరుకు 9.49 గంటలకు చేరుకుంటుంది. అటు, అటు, విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరే వందేభారత్ రైలు ఏలూరుకు సాయంత్రం 5.54 గంటలకు వస్తుంది. ఆగస్టు 25 నుంచి వందేభారత్ రైలుకు ఏలూరు స్టాపింగ్ అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Tirumala High Alert : పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు.
Tirumala High Alert : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్! కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.
తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు ఆక్టోపస్ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.