చిరు పేరుతో క్రాఫ్‌పై స్పందించిన వైష్ణవ్‌ తేజ్.. అదొక చేదు జ్ఞాపకం అంటూ

చిరంజీవిపై తనకున్న అభిమానంతోనే చిరు పేరుతో క్రాఫ్ చేయించుకున్నాని చెప్పారు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. తన కమింగ్ మూవీ 'ఆదికేశవ'ను ప్రచారం చేస్తున్న వైష్ణవ్.. సినిమా విశేషాలతోపాటు మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

New Update
చిరు పేరుతో క్రాఫ్‌పై స్పందించిన వైష్ణవ్‌ తేజ్.. అదొక చేదు జ్ఞాపకం అంటూ

మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ పై యంగ్ హీరో, చిరు అల్లుడు వైష్ణవ్‌ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్ కమింగ్ మూవీ ‘ఆదికేశవ’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో తన సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ మూవీ విశేషాలతోపాటు తన నెత్తిలో చిరు పేరును క్రాఫ్‌ చేయించుకోవడంపై ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.

శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంనుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు వచ్చిన స్పందన పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఇక క్రాఫ్ గురించి మాట్లాడుతూ.. 'పెద్ద మామయ్య చిరంజీవి పుట్టినరోజుకు అందరూ బహుమతులు తెచ్చారు. సాయి ధరమ్‌ తేజ్ పెద్ద కత్తిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. నేను మాత్రం ఆయనకు నా ప్రాణం తప్ప ఏమీ ఇవ్వగలను అని అనిపించింది. దీంతో సర్‌ప్రైజ్‌ చేద్దామని చిరు అని వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్నా. ఇక మా ఇళ్లలో ఏ వేడుక జరిగినా రామ్‌ చరణ్‌ అందరినీ అలరిస్తాడు. ఎంతో హుందాగా ఉంటాడు. మా అన్నయ్య సాయిధరమ్‌ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్‌ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకం. దాన్ని మేమంతా ఎప్పుడో మర్చిపోయాం' అంటూ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.

Also read :తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి

ఇక నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jethwani case: జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. IPS ఆఫీసర్ అరెస్ట్!

ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

New Update
jatwani

AP IPS officer Anjaneyulu arrest

Jethwani case: ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విజయవాడ తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు. 

అసలేం జరిగిందంటే..

నటి జత్వానీని వైసీపీ నేత విద్యాసాగర్ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఫిర్యాదుతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వాని కేసు వేయడంతోనే ఆమెను అరెస్ట్ చేశారనే వాదనలు వినిపించాయి. దీంతో కేసు వాపస్ తీసుకోవాలని జత్వానీని ఒత్తిడికి గురిచేశారని, ఇందులో పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతిరాణాటాటా, విశాల్ గున్నిల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురి పాత్ర ఉందని తెలియడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు రామాంజనేయులు అరెస్టుతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. 
 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇదిలా ఉంటే.. జాత్వానీ కేసులో ఫిబ్రవరి 2న ఫిర్యాదు అందితే పోలీసులు కమిషనర్‌ కార్యాలయం నుంచి ముంబై వెళ్లడానికి 1వ తేదీన విమాన టికెట్లు బుక్‌ చేశారు. అలాగే స్పా సెంటర్ లో ఫిబ్రవరి 11న సోదాలు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లుగా ప్రచారం చేసి 10వ తేదీన ఢిల్లీ విమాన టికెట్లు బుక్‌ చేసుకోవడం విశేషం. ఇక విద్యాసాగర్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసు బృందం ఢిల్లీ వెళ్లి.. అమిత్ కోసం వెతికింది. అతను దొరకకపోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఇబ్రహీంపట్నంలో జెత్వానీపై నమోదు చేసిన తప్పుడు కేసులో ఐపీఎస్‌ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, డీఎస్పీ హనుమంతరావు, ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేశారు. వాళ్లందరినీ కాదంబరి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులో నిందితులుగా చేర్చారు. పటమటలో నమోదు చేసిన అమిత్‌సింగ్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

actress-jatwani | mumbai | ips | arrest | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment