యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం..! యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం ధామి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన ఈ బిల్లు ఆమోదం పొందింది. By Bhoomi 04 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరాఖండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూసీసీ (యూనిఫాం సివిల్ కోర్టు )బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి కేబినెట్ ఈరోజు సాయంత్రం సమావేశం అయ్యింది. అనంతరం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. దానిని బిల్లు రూపంలో అసెంబ్లీలో తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని యూసీసీ డ్రాఫ్టింగ్ కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ముసాయిదాను సమర్పించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి అధ్యక్షతన జరిగిన కీలక క్యాబినెట్ సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా నివేదిక తుది ఆమోదం పొందింది. దీనిని అనుసరించి, ఫిబ్రవరి 6న అసెంబ్లీలో UCC బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు స్థిరమైన పౌర చట్టాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. The Uttarakhand Cabinet approved the UCC report in the cabinet meeting being held at the Chief Minister's residence under the chairmanship of Chief Minister Pushkar Singh Dhami. pic.twitter.com/Zf1xysFMgq — ANI (@ANI) February 4, 2024 #uttarakhand #pushkar-singh-dhami #dehradun మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి