Ear Buds: చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ వాడుతున్నారా?..జాగ్రత్త

చెవులను క్లీన్‌ చేసుకోవడానికి మృదువైన కాటన్ ఇయర్ బడ్స్ కూడా చెవులను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.  చెవులను సరిగా క్లీన్‌ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా  ఉన్నయని హెచ్చరిస్తున్నారు. చెవిలో  గుమిలి ఎక్కువైనప్పుడు చెవిని తడి గుడ్డతో తుడిస్తే సరిపోతుంది.

New Update
Ear Buds: చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ వాడుతున్నారా?..జాగ్రత్త

Ear Buds: మీ చెవులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం ప్రాధాన్యతనివ్వాలి కానీ అది చెవులకు హాని కలిగించకూడదు. చెవిలో గుమిలి అనేది ప్రమాదకరం కాదు. అది బయటి బాక్టీరియా, ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ చెవులను రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. చాలా మంది చెవులను క్లీన్‌ చేసుకోవడానికి ఇయర్ బడ్స్ ఉపయోగిస్తారు. అసలు విషయం ఏంటంటే మృదువైన కాటన్ ఇయర్ బడ్స్ కూడా చెవులను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. సరిగా ఉపయోగించకపోతే చెవులకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ఇయర్ బడ్స్‌ వల్ల సమస్యలు:

చెవులను శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్‌ను పెడితే అవి ఇయర్‌వాక్స్‌ను బయటకు తీయడానికి బదులుగా మరింత లోపలికి నెడతాయి. దీని వల్ల చెవిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇయర్ బడ్స్ పదే పదే ఉపయోగించడం వల్ల సున్నితమైన చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. ఇది చికాకు, వాపునకు కారణమవుతుందని వైద్యులు అంటున్నారు. సరిగా వినియోగించకపోతే చెవిలోని ఇయర్‌వాక్స్ ఒకవైపు పేరుకుపోవడంతో గట్టిపడుతుంది. దీని వల్ల చెవుడు, చెవి నొప్పి, చెవులలో శబ్ధం, మైకం వస్తాయి.అలాంటి సమస్యలు వస్తే వెంటనే ENT వైద్యుడిని సంప్రదించి మీ చెవులను శుభ్రం చేసుకోండి.

చెవుడు రావచ్చు:

మీరు చెవుల లోపల ఇయర్ బడ్స్ ఉపయోగిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది చెవి లోపలి భాగంలో గాయం కావొచ్చు. అంతేకాకుండా చెవుడు, వెర్టిగో సమస్యలు వస్తాయని, చెవులు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. సాధారణంగా చెవులు వాటంతటవే క్లీన్‌ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. గుమిలి ఎక్కువైనప్పుడు అదే బయటికి వచ్చేస్తుంది. తలస్నానం చేసినప్పుడు మీ బయటి చెవిని తడి గుడ్డతో తుడిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: గ్రీక్ పెరుగు ఎప్పుడైనా విన్నారా? రెగ్యులర్ పెరుగుకీ దీనికీ తేడా ఏమిటంటే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు