Ukraine: ఉక్రెయిన్ లోకి అమెరికా బలగాలు.. బైడెన్ సర్కార్ బిగ్ స్కెచ్! ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా తన మిలటరీ కాంట్రాక్టర్లను కీవ్ కు పంపించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బైడెన్ సర్కార్ భావిస్తోంది. ఏడాది చివర్లో అమెరికా సైన్యం కీవ్ వెళ్లనున్నట్లు సమాచారం. By srinivas 26 Jun 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి America: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సపోర్టుగా మిలటరీ కాంట్రాక్టర్లను పంపించేందుకు బైడెన్ సర్కారు సన్నాహాకాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు అమలులో ఉన్న అప్రకటిత నిషేధాన్ని తొలగించబోతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు.. అయితే ఉక్రెయిన్ పాలసీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకొన్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. కాగా రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడితే ఈ ఏడాదే అమల్లోకి రానుంది. పెంటగాన్‌లోని పలు అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా అక్కడ పని చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆయుధ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణను వేగవంతం చేసే అవకాశం ఈ నిర్ణయంతో లభిస్తుంది. దాదాపు 2ఏళ్ల బైడెన్ సర్కారు అమెరికా జాతీయులను, సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పంపించేందుకు తడపడుతోంది. తమతో అమెరికా మిలటరీ నేరుగా తలపడిందన్న భావన రష్యా వారికి కలగకూడదని ఇన్నాళ్లు వేచి చూసింది. ముఖ్యంగా విదేశాంగశాఖ కూడా ఈ విషయంలో విముఖంగానే ఉంది. దీంతో ఇన్నాళ్లు అమెరికా ఇచ్చిన ఆయుధ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భాల్లోను వాటిని పోలాండ్, రొమానియా, లేదా సమీపంలోని ఇతర నాటో దేశాలకు తరలించాల్సి రావడంతో ఆలస్యం అవుతోంది. ప్రభుత్వ నిధులతో పనిచేసే కాంట్రాక్టర్లను అక్కడకు పంపి ఆయుధాల మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి ఈ ఏడాది చివర్లో అమెరికా ఎఫ్-16 కీవ్‌కు చేరనుండటంతో వాటి నిర్వహణకు కూడా ఈ సిబ్బంది ఉపయోగపడనున్నారు. తమ ఆయుధాలతో రష్యా భూభాగంపై కీవ్ దాడులు చేయవచ్చని మే నెలలో బైడెన్ సర్కారు అనుమతి ఇచ్చింది. #ukraine #russia #us-military మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి