Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు..ఎలా యాక్టివేషన్‌ చేసుకోవాలంటే!

యూపీఐ సేవలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ- కామర్స్‌ అప్లికేషన్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌ లు కూడా యూపీఐ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది. ఇక నేరుగా స్విగ్గీ పేమెంట్ యాప్ లోనే వినియోగదారులు నగదు చెల్లించవచ్చని సంస్థ పేర్కొంది.

New Update
Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు!

Swiggy UPI Service: యూపీఐ సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ అప్లికేషన్లు, ఫుడ డెలివరీ యాప్ లు...తమ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా పేమెంట్స్ చేసే సదుపాయాల్ని తాజాగా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకుని వస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో యూపీఐ సేవల్ని ప్రారంభించాయి. తాజాగా ఆ లిస్ట్‌ లోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది.

తన అప్లికేషన్‌ వేదికగా యూపీఐ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా తెలిపింది. యూపీఐ సదుపాయంతో ఇక పై స్విగ్గీ ఫ్లాట్‌ఫామ్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్లు చెల్లింపుల కోసం గూగుల్‌ పే, ఫోన్‌ పే తరహా థర్డ్‌ పార్టీ యాప్స్‌ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నేరుగా స్విగ్గీ యాప్‌ ద్వారానే పేమెంట్‌ చేయోచ్చు.

లావాదేవీల ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు స్విగ్గీ హెడ్‌ అనురాగ్‌ రెడ్నెస్‌ తెలిపారు. అయితే దీని కోసం స్విగ్గీ యూపీఐ యాక్టివేట్‌ చేసుకోవాలని తెలిపింది. స్విగ్గీ యాప్‌ లో ప్రొఫైల్‌ పై క్లిక్‌ చేసి పేమెంట్స్ పేజీలోకి వెళ్లగానే బ్యాంక్‌ లింక్డ్‌ యూపీఐ అకౌంట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ అంటూ అనేక పేమెంట్‌ ఆప్షన్లు అక్కడ దర్శనమిస్తాయి. అందులోనే స్విగ్గీ యూపీఐ పేమెంట్‌ ఆప్షన్‌ ఎంచుకుని అక్కడే మీ వివరాలు..రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఓటీపీ సాయంతో వెరి ఫై చేసి, బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేయాలి.. యూపీఐ పిన్‌ సాయంతో ఇక పేమెంట్స్‌ చేయోచ్చు.

Also Read: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Poco C71: పోకో నుంచి పిచ్చెక్కించే ఫోన్.. 6/128జీబీ ధర కేవలం రూ.7,499- అస్సలు వదలొద్దు!

టెక్ బ్రాండ్ పోకో తాజాగా తన పోకో సి71 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. 4/64జీబీ వేరియంట్ రూ.6,499, 6/128జీబీ ధర రూ.7,499గా ఉంది. వీటి ఫస్ట్ సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.

New Update
Poco C71 Launched in India Rs 6,499

Poco C71 Launched in India Rs 6,499

Poco C71 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో భారతదేశంలో లాంచ్ అయింది. ఇది 6.88-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ TUV రైన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది Unisoc T7250 SoCలో పని చేస్తుంది. గరిష్టంగా 6GB RAMతో వస్తుంది. 

Also read: పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

Poco C71 Price

భారతదేశంలో Poco C71 ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో బేస్ 4GB + 64GB కాన్ఫిగరేషన్ ధర రూ.6,499 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 6GB + 128GB వేరియంట్ ధర రూ.7,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్‌ డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. Poco C71 సేల్ ఏప్రిల్ 8 నుండి ప్రారంభమవుతుంది. 

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

దీనిని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkart నుంచి కొనుక్కోవచ్చు. మొదటి సేల్‌లో పలు ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లు Airtel ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అందించబడ్డాయి. వారు Poco C71ని కేవలం రూ. 5,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎక్స్‌ట్రాగా 50GB డేటా ప్రయోజనాలు లభిస్తాయి. 

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Poco C71 Features

Poco C71 ఫోన్ Android 15 పై నడుస్తుంది. వినియోగదారులు రెండు సంవత్సరాల Android OS అప్‌డేట్‌లను, నాలుగు సంవత్సరాల సెక్యురిటీ ప్యాచ్ అప్డేట్‌లను పొందుతారు. Poco C71 6.88-అంగుళాల HD+ (720x1,640 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్ వంటి సర్టిఫికేషన్ అందించారు. అంతేకాకుండా ఇది Unisoc T7250 SoC ద్వారా ఆధారితం అయింది. 

Poco C71 ఫోన్ 32 మెగా పిక్సెల్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. Poco C71 ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇది 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, FM, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్‌తో సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

(latest-telugu-news | telugu-news | mobile-offers)

Advertisment
Advertisment
Advertisment