UPI Payments: బయోమెట్రిక్, ఫేస్‌ ఐడీలతో UPI పేమెంట్స్.. ఎప్పటి నుంచి అంటే?

భారతదేశంలో లక్షలాది మంది UPI ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI పేమెంట్ల భద్రతను పెంచేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఫోన్‌లలో ఫేస్ ఐడీ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

New Update
UPI Payments: బయోమెట్రిక్, ఫేస్‌ ఐడీలతో UPI పేమెంట్స్.. ఎప్పటి నుంచి అంటే?

UPI Payments: భారతదేశంలో ఇప్పటి వరకూ లక్షల మంది UPI ద్వారా లావాదేవీలు(UPI Payments) చేస్తున్నారు, అనేక UPI యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, డిజిటల్ పేమెంట్ల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు తాజా అప్‌గ్రేడ్లు చేపడుతున్నట్లు సమాచారం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంబంధిత సంస్థలతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ మార్పులు, బయోమెట్రిక్ ఫీచర్లను ఉపయోగించి UPI లావాదేవీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాయని అంచనా.

ఇదిలా ఉంటే, త్వరలో UPI పేమెంట్స్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఫోన్‌లలో ఫేస్ ఐడీ ద్వారా చేయగలగటానికి సిధ్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మనీకంట్రోల్ కథనంలో వెలుగు చూశింది. నేరాలు పెరిగిన నేపథ్యంలో, UPI పేమెంట్ల భద్రతను పెంచేందుకు ఈ విధానాలను అమలు చేయాలని NPCI ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం, డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా 4 లేదా 6 అంకెల పిన్ ఉపయోగించి లావాదేవీలు జరుగుతున్నాయి. UPI వ్యవస్థ ఇప్పటికీ అత్యంత సురక్షితంగా ఉంది, అయితే నేరగాళ్లు ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు అకౌంట్లకు పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో, UPI వ్యవస్థను మరింత సురక్షితంగా చేయడానికి ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు చేయడాన్ని NPCI పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు.

Also Read: ఆగస్టు 15న ఒలింపిక్స్‌ విజేతలతో ప్రధాని భేటీ

డిజిటల్ లావాదేవీలలో అదనపు భద్రత కోసం Reserve Bank of India (RBI) సూచించిన మార్గదర్శకాలను బట్టి, NPCI ఈ ప్రతిపాదనను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పిన్ ఆధారిత వ్యవస్థతో పాటు, బయోమెట్రిక్ ఫీచర్లను కూడా కొత్త కాలంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Rates Today: ఆల్‌టైమ్ రికార్డ్.. లక్ష దాటిన బంగారం ధర

బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.

New Update
Gold rate

Gold rate

బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర పన్నులతో కలిపి ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అంచర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం సోమవారం 3,405 డాలర్లకు చేరింది. 

Also Read: దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ క్వాలిఫై

Gold Rates Crossed 1Lakh Mark

అంటే మన కరెన్సీలో లక్ష రూపాయలకు చేరుకుంది. సాయంత్రం 5.30 గంటలకు 24 క్యారెట్ల పసిడి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2 వేలు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటిదాక బంగారం ధర దాదాపు రూ.20 వేలకు పైగానే ఉంది. డిసెంబర్ 31న దాదాపు రూ. 79 వేలు ఉన్న బంగారం ధర.. గత 3 నెలల్లోనే 26 శాతం పెరిగింది. వెండి ధర కూడా కిలో ధర రూ. లక్షకు చేరువవుతోంది.   

Also Read: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!

గతంలో ఓసారి లక్ష మార్కును దాటిన కిలో వెండి ధర.. ప్రస్తుతం రూ.99,299గా ఉంది.  మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో కూడా 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.96 వేల మార్కు దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్స్‌లో 10 గ్రాముల బంగారం ఒక్కరోజులోనే ఏకంగా రూ.1621 పెరిగింది. ఇంట్రాడేలో రూ.96,875 వద్ద గరిష్ఠానికి చేరుకుంది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌లో పరిస్థితులు సద్దుమణిగేవరకు ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Also Read :  హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల పాడుపని.. మత్తు కోసం ఇంక్షన్లు, ట్యాబ్లెట్లు - ఒకరు మృతి

Also Read: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!

 

telugu-news | rtv-news | gold-rates-today | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu | business news telugu

Advertisment
Advertisment
Advertisment