CINEMA: పండగలు వచ్చాయంటే తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా అప్డేట్స్ , అలాగే సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఇక ఈరోజు ఉగాది పండగ సందర్భంగా బోలెడు సినిమా అప్డేట్స్ వచ్చాయి. సోషల్ మీడియా అంతా మూవీ పోస్టర్ల సందడి నెలకొంది. ఈరోజు విడుదలైన సినిమా పోస్టర్స్, అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.
రవితేజ RT 75
రీసెంట్ గా 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @Raviteja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
We promise to bring back the typical Mass Maharaja on Big screens with his impeccable energy, comedy, foot tapping dance numbers… pic.twitter.com/JfdYlq5aHi
— Naga Vamsi (@vamsi84) April 9, 2024
నవదీప్ 'లవ్ మౌళి' ట్రైలర్
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ మౌళి'. నేడు ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.
A story of a lone man and his search of true love ❤🔥
Here’s presenting you all the theatrical trailer of #LoveMouli ❤️
In Cinemas #LoveMouliOnApril19th pic.twitter.com/kNwFe0lu5J
— Navdeep (@pnavdeep26) April 9, 2024
సరిపోదా శనివారం పోస్టర్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారం. నేడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.
అరణ్మనై 4
రాశీ ఖన్నా, తమన్నా, సుందర్ సి, కోవలి సరళ, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అరణ్మనై 4. నేడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.