/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/UP-News.jpg)
UP News: ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మాఫియా, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద ఆపరేషన్ అక్కడ నిర్వహిచారు. అక్బర్‌నగర్‌లోని కుక్రైల్ నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన భవనాలను ధ్వంసం చేసినట్లు లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డిఎ) అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ జూన్ 18 నుండి ప్రారంభమై నేటితో (జూన్ 20) ముగిసింది.
UP News: బుల్‌డోజర్‌లతో సహా భారీ యంత్రాలను ఉపయోగించి దాదాపు 1,169 అక్రమ నివాస ఆస్తులు - 100కి పైగా వాణిజ్య ఆస్తులు ధ్వంసం చేశారు. ఇందులో భాగంగా అక్రమంగా నిర్మించిన మసీదులను కూడా కూల్చివేశారు. 24.5 ఎకరాల భూమిలో అక్రమ ఆక్రమణలు తొలగించే పనులు గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో మతపరమైన స్థలాలు సహా 1,320కి పైగా అక్రమ భవనాలు నేలమట్టమయ్యాయి.
UP News: జూన్ 18న దాదాపు 100 భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు దాని అవశేషాలను క్లియర్ చేసే పని జరుగుతోంది. ఈ తొలగింపు చర్య వల్ల ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నగరంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ వసతి కల్పించారు. అక్బర్‌నగర్‌లోని 1,800 కుటుంబాలకు వసతి కల్పించారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.