Telangana BJP: జమ్మికుంటకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. షెడ్యూల్ వివరాలివే..

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ షెడ్యూల్ ఖరారైంది. హుజురాబాద్ లోని జమ్మికుంటతో పాటు మహేశ్వరంలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు హాజరుకానున్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సోమవారం(అక్టోబర్ 16) మధ్యాహ్నం 12:10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు హుజురాబాద్ కు చేరుకుంటారు.

New Update
Defence Minister Rajnath Singh: మోదీ మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Union Minister Rajnath Singh Telangana: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ షెడ్యూల్ ఖరారైంది. హుజురాబాద్ లోని జమ్మికుంటతో పాటు మహేశ్వరంలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు హాజరుకానున్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సోమవారం(అక్టోబర్ 16) మధ్యాహ్నం 12:10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు హుజురాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు చేరుకుని మధ్యాహ్నం 1 గంటల నుంచి 2గంటల వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. సభ ముగిశాక 7:35 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు రాజ్‌నాథ్ సింగ్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారు. వీరి పర్యటనలకు సంబంధించి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఇవాళ కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ముషీరాబాద్ ప్రాంతంలో పర్యటించారు.

ఇక సోమవారం అంటే అక్టోబర్ 16వ తేదీన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే సమయంలో 16వ తేదీన కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Also Read:

CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు