Rashmika Deepfake Video: రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి సీరియస్.! రష్మిక డీప్ ఫేక్ వీడియో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడియోపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా వేదికలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని హెచ్చరించారు. By Jyoshna Sappogula 08 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rashmika Deepfake Video: నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి సంబంధించిన ఒక మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లో కనిపించారు. అది చూసిన రష్మిక ఫ్యాన్స్ ఆ వీడియో నిజంగా రష్మికదేనని షాక్ అయ్యారు. అయితే అది ఫేక్ వీడియో అని ఓ వ్యక్తి పోస్టు చేయడం, దాని ఒరిజినల్ వీడియో కూడా షేర్ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. Also Read: రష్మికే కాదు..కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే.! రష్మిక ఫేక్ వీడియోపై సామాన్యులు నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఆశ్చర్య పోయారు. ఈ వీడియో ఏఐ ద్వారా మార్ఫింగ్ (AI Morphing) చేసినట్లు తేలడంతో అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ ప్రతి ఒక్కరూ స్పందిస్తూ రష్మిక ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. ఇలాంటి వాటి కోసం కొత్త చట్టాలు తీసుకురావాలని కోరారు. తాజాగా ఈ వీడియోపై సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) కూడా స్పందించారు. PM @narendramodi ji's Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet Under the IT rules notified in April, 2023 - it is a legal obligation for platforms to ➡️ensure no misinformation is posted by any user AND ➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 6, 2023 సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా వేదికలదేనని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు దీనికి కట్టుబడి ఉండకపోతే, IPC నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌లను కోర్టుకు తీసుకెళ్లవచ్చని తెలిపారు. డీప్ ఫేక్ లతోపాటు ప్రమాదకరమైనవి, తప్పుడు సమాచారం వంటివి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందిని హెచ్చరించారు. Also Read: గోవాలో ఘనంగా జరగనున్న సంతోషం అవార్డ్స్ ఈవెంట్ #rashmika-mandanna #rashmika-mandanna-recent-video #union-minister-rajeev-chandrasekhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి