Kishan Reddy: 'ఆ విషయంలో కేసీఆర్‌కు ఆస్కార్, నోబెల్ అవార్డ్ ఇవ్వొచ్చు' తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు. By Shiva.K 05 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Union Minister Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ(PM Modi) వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు. అధికారం తలకెక్కి డబ్బుల అండతో తెలంగాణను ఏమైనా చేస్తామని అహాంకార పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తే కనీసం కలవడం కూడా చేతకాక.. చెత్త పోస్టర్లు అంటించారంటూ నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తె టూరిస్ట్ అని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ తానే పెడతానంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక కమిటీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటీ లేదని తేల్చి చెప్పాయని వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరు పెట్టి తెలంగాణ సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం గౌరవించిందన్నారు. యూనివర్సిటీకి ఇచ్చిన 50 ఎకరాలకు క్లియరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు. యూనివర్సిటీకి భూమి కోసం వెంటపడి, వెంటపడి ఉత్తరాలు రాశానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. 10 సంవత్సరాలుగా గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులకు అన్యాయం చేశారన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 894 కోట్లతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 26.6 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి. ప్రయాణికులకు మరియు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడను సందర్శించే భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతులు ఈ రైల్వే స్టేషన్… pic.twitter.com/7lX2zuRyHZ — G Kishan Reddy (@kishanreddybjp) October 5, 2023 అందుకు కారణం కేసీఆర్ సర్కారే.. కృష్ణా వాటర్ పంపిణీ జరుగకపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆరోపించారు కిషన్ రెడ్డి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి.. ఇప్పుడు ఆ అంచనా రూ. 55 కోట్లకు పెరిగిన తరువాత పనులను ప్రారంభించారని ఆరోపించారు. తద్వారా రూ. 22వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. రిజర్వార్లు పూర్తి కాలేదు కానీ.. ఫోటోలకు ఫోజులు మాత్రం ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. Also Read: ఎన్డీయేకు గుడ్‌బై..జనసేనాని కీలక నిర్ణయం.! జర్నలిస్టుల సమస్యపై.. ఇదే సమయంలో జర్నలిస్టులపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్ముకోవడానికి ప్రభుత్వ స్థలాలు ఉంటాయి.. కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి స్థలం ఉంటుంది.. కానీ, జర్నలిస్టులకు, పేదలకు ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని అన్నారు. Live: Press Meet, @BJP4Telangana State Office, Nampally, Hyderabad. https://t.co/w260nceFxe — G Kishan Reddy (@kishanreddybjp) October 5, 2023 Also Read: Mohammad Azharuddin: అజారుద్దీన్‌కి షాక్.. HCA ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు.. #telangana #hyderabad #cm-kcr #union-minister-kishan-reddy #bjp-kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి