విశ్వకర్మలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! ఏంటో తెలుసా?

విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.

author-image
By G Ramu
New Update
విశ్వకర్మలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! ఏంటో తెలుసా?

విశ్వకర్మలకు కేంద్రం(union governament) శుభవార్త చెప్పింది. విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ పథకం గురించి ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ముద్ర ఆమోద ముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. విశ్వకర్మలకు ఈ పథకం కింద సర్టిఫికేట్లు, ఐడీ కార్డులు ఇచ్చి గుర్తిస్తామని తెలిపారు.

విశ్వకర్మలకు 5 శాతం వడ్డీ కింద మొదటి విడతలో రూ. 1 లక్ష చొప్పు క్రెడిట్, రెండో విడతలో రూ. 2 లక్షల వరకు రుణాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ పథకంలో భాగంగా విశ్వకర్మలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన శిక్షణను అందజేస్తామన్నారు. శిక్షణా సమయంలో రూ. 500 వరకు స్టైపెండ్ అందించనున్నట్టు వివరించారు.

విశ్వకర్మలకు వారికి కావాల్సిన పనిముట్లను అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆధునిక వృత్తిపరమైన ఉఫకరణాలను కొనుగోలు చేసేందుకు రూ. 15,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించి గ్రామాల్లోని ఉమ్మడి సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటికి నీళ్లు అందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఉన్నతాధికాలు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

New Update
Madhya Pradesh villager offers water to cheetah

Madhya Pradesh villager offers water to cheetah

వేసవి కాలం రావడం వల్ల మూగజీవాలకు నీళ్లు దొరకగా అవస్థలు పడుతున్నాయి. సాధారణంగా కొంతమంది జంతు ప్రేమికులు మూగజీవుల కోసం ఆహారం, నీటి వసతులను ఏర్పాటు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందులో ఉన్న చీతాలకు నీళ్లు అందించినందుకు ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. ఈ క్రమంలోనే అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటిని గమనించి ఓ క్యాన్‌లో నీళ్లు తీసుకొచ్చాడు. ఓ పాత్రలో ఈ నీటిని పోసీ చీతాలకు తాగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆయన చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఆ డ్రైవర్‌పై మండిపడ్డారు. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచే సస్పెండ్ చేశాడు. 

దీనిపై అటవీశాఖ అధికారి ఓ ప్రకటన చేశారు. '' చీతాలకు నీళ్లు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు ఎవరికీ హాని కలిగించేవి కావని వాళ్లు తెలుసుకుంటున్నారు. ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని కూడా వాళ్లందరూ గ్రహించారు. వాటితో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని'' అటవీశాఖ అధికారి అన్నారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

మరోవైపు ఇటీవల చీతాను దాని పిల్లలు ఓ జంతువు వెంట పడుతూ గ్రామంలోకి వచ్చాయి. దీంతో వాటిని పొలంలో చూసిన కొందరు స్థానికులు భయపడ్డారు. ఆ తర్వాత చీతాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. తాజాగా వాటిని నీరు అందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


 

 rtv-news | national-news | kuno-national-park 

Advertisment
Advertisment
Advertisment