Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే

త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.

New Update
Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే

9 carats Gold Rate : ప్రస్తుతం బంగారం ధరలు (Gold Rates) రూ. 70 వేలకు అటూ ఇటుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అటువైపు చూడాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఆ మేరకు బంగారం దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.

దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ఇవ్వడం ఎందుకు అనే ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుంది.

Also Read: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు